నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఇప్పటివరకు పలువురుని అరెస్టు చేసింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో సీబీఐ.. మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. పేపర్ లీక్‌కు సంబంధించి కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను శనివారం అదుపులోకి తీసుకుంది. నిందితులిద్దరూ భరత్‌పూర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కమార్ మంగళం బిష్ణోయ్, దీపేందర్ కుమార్‌లుగా గుర్తించారు.
Also Read: త్వరలో హర్యానా ఎన్నికలు.. ఆప్ కీలక హామీలు
వీళ్లిద్దరూ గతంలో అరెస్టయిన ఇంజనీర్ పంకజ్ కుమార్ నీట్ పేపర్ ను దొంగిలించడంలో సాయం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్‌పూర్‌కు (జార్ఖండ్)చెందిన 2017-బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్.. హజారీబాగ్‌లోని ఎన్టీయే ట్రంక్ నుంచి నీట్ పేపర్‌ను దొంగిలించాడని ఆరోపణలు రావడంతో అతడిని సీబీఐ కొన్నిరోజుల క్రితమే అరెస్టు చేసింది.
Also Read: రీ ఎగ్జామ్‌లో తేలిపోయిన టాపర్లు