హర్యానాలో ఈ ఏడాది అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించింది. శనివారం ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్.. ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’లను ప్రకటించారు. ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్తో కలిసి ఆమె ఈ ప్రకటన చేశారు. హామీల్లో భాగంగా.. ఆప్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్, కుటుంబంలో అందరికి ఉచిత వైద్యం, పిల్లలకు నాణ్యమైన విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, అలాగే మహిళలను నెలకు రూ.1000 అందిస్తామని తెలిపారు.
పూర్తిగా చదవండి..Haryana Elections: త్వరలో హర్యానా ఎన్నికలు.. ఆప్ కీలక హామీలు
అక్టోబర్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ 'కేజ్రీవాల్ కీ గ్యారంటీ'లను ప్రకటించింది. 24 గంటల ఉచిత విద్యుత్, కుటుంబంలో అందరికి ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.1000 అందిస్తామని హామీ ఇచ్చింది.
Translate this News: