NEET Re Exam: మళ్ళీ పెట్టిన పరీక్షలో అసలు రంగు బయటపడింది. అప్పుడు 720 కు 720 వచ్చిన వాళ్ళకు ఇప్పుడు 682 మార్కులు దాటలేదు. హర్యానాలో ఒక సెంటర్లో నీట్ ఎగ్జామ్ రాసిన ఆరుగురికి ఫుల్ మార్కులు వచ్చాయి. దీంతో మొత్తం నీట్ పరీక్ష నిర్వహణపైనే అనుమానాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా పెద్ద గొడవే జరిగింది. దాని తర్వాత గ్రేసు మార్కులు కలపవడం వల్లే అలా జరిగిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇచ్చుకుంది. దాని తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి రీటెస్ట్ నిర్వహించారు. దాని ఫలితాలు ఇవాళ వచ్చాయి. అయితే ఇందులో రిజల్ట్ వేరేగా వచ్చింది.
పూర్తిగా చదవండి..NEET: రీ ఎగ్జామ్లో తేలిపోయిన టాపర్లు
ఈ ఏడాది నీట్ ఎగ్జామ్ ఫలితాలు పెద్ద దుమారమే రేపాయి. ఒక సెంటర్లో నీట్ యూజీ రాసిన ఆరుగురికి ఫుల్ స్కోర్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ నిర్వహించిన రీ ఎగ్జామ్లో మాత్రం ఎవరికీ అన్ని మార్కులు రాలేదు. మొదటి దానికి, రెండో దానికి చాలా పెద్ద వ్యత్యాసమే కనిపించింది.
Translate this News: