World Cup 2023:ఇండియా కప్ గెలవాలంటే..ఆ మొనగాడే ముఖ్యం

World Cup 2023:ఇండియా కప్ గెలవాలంటే..ఆ మొనగాడే ముఖ్యం
New Update

10 వరుస విజయాలు అందుకున్న టీమిండియా.. అజేయంగా ఫైనల్ చేరింది. ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. లీగ్ దశలో 9 మ్యాచుల్లో అన్ని జట్లను చిత్తు చేసింది. సెమీస్ లో న్యూజిలాండ్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు మూడోసారి విశ్వవిజేతగా నిలబడేందుకు సన్నద్ధం అవుతోంది. అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో తలపడే ఫైనల్ మ్యాచ్ కు సై అంటోంది. అయితే ఈ మ్యాచ్ లో తోపు కెప్టెన్ రోహిత్ శర్మనే అంటున్నారు క్రికెట్ నిపుణులు, మాజీలు.

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే రెచ్చిపోతున్నాడు. తగ్గేదే ల్యా అంటూ ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. టీమ్ ఇండియా ముందు బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా దూకుడుగా ఆడుతున్నాడు. మొదటి ఓవర్ నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ.. పరుగుల వరద పారిస్తున్నాడు. సెమీస్ లో అయితే మొదటి ఓవర్లోనే సిక్స్ కొట్టాడు. హిట్‌మ్యాన్ సిక్సులకు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. పవర్ ప్లేలొ రోహిత్ దూకుడుగా ఆడుతుండడంతో.. భారత్ భారీ స్కోర్లు చేస్తోంది. రోహిత్ అటాకింగ్ కారణంగా తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి ఉండడం లేదు. దాంతో మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read:భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్…టికెట్ల కోసం ఎగబడుతున్న జనం

రోహిత్ శర్మ ఇచ్చే ధైర్యంతో తరువాత వచ్చే విరాట్, శ్రేయస్, అయ్యర్, కె ఎల్ రాహుల్ లు పరిస్థితికి తగ్గట్టు ఆడుతూ సెంచరీలు, హాఫ్ సెంచరీలతో విచుకుపడుతున్నారు. ఇప్పుడు టీమ్ ఇండియాకు ఇదే ప్లస్ గా మారనుంది. హిట్ మ్యాన్ రోమిత్ శర్మ ఎప్పటిలానే మొదటి పది ఓవర్లలో రెచ్చపోయి ఆడితే...మనకు భారీ స్కోర్ వస్తుంది. ఛేజింగ్ లో కూడా సులువు అయిపోతుంది. ఆసీస్ పేసర్లు స్టార్క్, కమిన్స్, హేజిల్ వుడ్ లకు చుక్కలు చూపించొచ్చు. అందుకే ఫైనల్ మ్యాచ్ కు రోహిత్ ఆటే కీలకం అని చెబుతున్నారు. ప్రపంచకప్ 2023లో హిట్‌మ్యాన్ 10 మ్యాచులలో 550 రన్స్ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 131.

ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ కకెప్టెన్ నాసిర్ ముస్సేన్ సెమీ ఫైనల్ మ్యాచ్ అయిన వెంటనే చెప్పాడు. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌ గెలిచిన తర్వాత స్కై స్పోర్ట్స్‌తో నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ.. రేపటి హెడ్‌లైన్స్‌ మొత్తం కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, మహమ్మద్ షమీ గురించే ఉంటాయి. కానీ ప్రస్తుత భారత జట్టు రియల్‌ హీరో మాత్రం రోహిత్‌ శర్మనే. అతడు భారత జట్టు స్ధితిని మార్చాడు. ఈ రోజు టీమ్ ఇండియా ఎటువంటి భయం లేకుండా ఆడుతోంది అంటే... అందుకు కారణం రోహిత్‌ శర్మనే. అతడు మొదటే మంచి ఆరంభాన్ని అందిస్తున్నాడు. కచ్చితంగా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని నాసిర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు.

#india #australia #rohith-sarma #captain #finals #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe