canada apologized to ukrain:ఉక్రెయిన్ కు సారీ చెప్పిన కెనడా ప్రధాని...భారత్ కు ఎప్పుడు చెప్తారో. మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. By Manogna alamuru 28 Sep 2023 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి కెనడాను వరుసపెట్టి వివాదాలు చుట్టుముడుతున్నాయి. భారత్ విషయంలో పట్టుమీదున్న ఆ దేశం ఉక్రెయిన్ విషయంలో మాత్రం దిగొచ్చింది. ఇందులో నాజీ అంశం కెనడాను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ప్రపంచ దేశాల నుంచి విపరీతంగా విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. దాంతో పాటూ కెనడా స్పీకర్ రాజీనామాకు కూడా దారి తీసింది. అందుకే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని ఆ దేశం భావించింది. అందులో భాగంగా ప్రధాని జస్టిన్ ట్రుడో బహిరంగా ఉక్రెయిన్ దేశానికి క్షమాపణలు చెప్పారు. దీని కోసం దౌత్య మార్గాల్లో చర్చలు కూడా జరిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రీసెంట్ గా కెనడాలో పర్యటించారు. సెప్టెంబర్ 22న యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కెనడా పార్లమెంట్‌లో ప్రసంగించారు.ఆయన ప్రసంగం తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో రష్యాపై పోరాడిన 98 ఏళ్ల యారోస్లావ్ హుంకాకి గౌరవవందనం చేశారు.కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో స్పీకర్ సహా ఎంపీలందరూ హుంకా గౌరవార్థం లేచి నిల్చున్నారు.హుంకా యుద్ధవీరుడని స్పీకర్ ఆంథోని రోటా ప్రశంసించారు. ఆయన ఉక్రెయిన్ మొదటి డివిజన్‌కి చెందిన వారని చెప్పారు. దీనికి అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రుడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సహా అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత హుంకా గురించి అసలు నిజం తెలిసింది. ఆయన హిట్లర్ సైన్యంలో పనిచేశారని, నాజీల తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారని తెలిసింది. ఈ సంఘటన ట్రుడో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. కెనడా ప్రధాని ఉక్రెయిన్ కు క్షమాపణలు చెబుతూ ఉక్రెయిన్ లక్ష్యాన్ని తప్పుదారి పట్టించేందుకు రష్యా మా తప్పిదాన్ని రాజకీయం చేస్తోంది. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. హుంకాను గౌరవించినందుకు స్పీకర్ రోటా ఇంతకుముందే క్షమాపణలు చెప్పారు. యుక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం తర్వాత, గ్యాలరీలో ఒక వ్యక్తిని చూశాను. ఆయనను గౌరవించాను. ఆ తర్వాత ఆయన గురించి మరింత సమాచారం తెలిసింది. నా నిర్ణయంపై విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు. కెనడాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను చేసిన పనికి నాదే బాధ్యత అని రోటా తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది అంతా బాగానే ఉంది కానీ భారత్ తో వివాదాన్ని మాత్రం కంటిన్యూ చేస్తోంది కెనడా ప్రభుత్వం. ఈ విషయంలో రోజురోజుకూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. #india #ukraine #russia #canada #prime-minister #justin-trudeau #issue #apologize #nazi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి