WhatsApp Chat Feature: వాట్సాప్‌లో సరికొత్త కొత్త చాట్ ఫీచర్! యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా కస్టమ్ లిస్ట్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లకు నచ్చినట్లుగా చాట్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చు By Kusuma 01 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి WhatsApp Chat Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా కస్టమ్ లిస్ట్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కస్టమ్ లిస్ట్ ఫీచర్‌తో యూజర్లకు నచ్చినట్లుగా చాట్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. ఇది కూడా చూడండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే! చాట్ లిస్ట్‌లు అన్ని ఒక దగ్గర ఉండటం వల్ల.. సాధారణంగా వాట్సాప్‌లో అన్ని చాట్‌లు ఒకే దగ్గర ఉంటాయి. గ్రూప్‌లు వేరేగా ఉంటున్నా, చాట్ లిస్ట్‌లు అన్ని ఒక దగ్గర ఉండటం వల్ల సడెన్‌గా మనకి ఏదైనా కాంటాక్ట్ కావాలంటే వెతకడం కష్టం అవుతుంది. సెపరేట్‌గా పేరుతో వెతకడం లేదా సెర్చ్ చేయాలి. దీనికి కాస్త సమయం కూడా పడుతుంది. ఇది కూడా చూడండి: సినిమా లెవల్‌లో గంజాయి అక్రమ రవాణా.. స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇక నుంచి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండకూడదని వాట్సాప్ కస్టమ్ లిస్ట్‌ను తీసుకొచ్చింది. ఈ లిస్ట్‌లో మీకు ముఖ్యమైన వ్యక్తులు, ఫ్రెండ్స్, ఆఫీస్ ఇలా కేవలం మీకు నచ్చిన వారిని యాడ్ చేసుకోవచ్చు. దీంతో మీకు సడెన్‌గా కావాల్సి వచ్చినప్పుడు కాంటాక్ట్ వెతక్కుండా ఒక్కసారిగా ఈ కస్టమ్ లిస్ట్‌లోకి వెళ్తే కనిపిస్తుంది. ఇది కూడా చూడండి: దాడికి సిద్ధమవుతున్న ఇరాన్.. ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే! ఈ కస్టమ్ లిస్ట్‌ను సెట్ చేసుకోవాలంటే వాట్సాప్ ఓపెన్ చేయాలి. అందులో + ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఈ కస్టమ్ లిస్ట్‌ను సెట్ చేసుకోవాలి. ఆ + ఐకాన్‌ను లాంగ్ ప్రెస్ చేసి ఆ కస్టమ్ లిస్ట్‌ను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి వచ్చింది. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ ఫీచర్‌ను యాడ్ చేసుకోండి. ఇది కూడా చూడండి: స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు! #telugu-news #rtv #whatsapp #whatsapp-new-feature #latest-technology-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి