TVS: సూపర్ బైక్.. లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ మైలేజ్, ధర చాలా తక్కువ! టీవీఎస్ స్టార్ స్పోర్ట్ బైక్ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనిని రూ.68 వేలకే కొనుక్కోవచ్చు. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌తో సుమారు 70 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. అందువల్లనే ఎక్కువ మంది సామాన్యులు ఈ బైక్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. By Seetha Ram 30 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి దేశీయ మార్కెట్‌లో చాలా రకాల బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో తక్కువ ధరలో అధిక మైలేజీ అందించే బైక్‌ల కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి బైక్‌ల కోసం ఇంటర్‌నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. మరి మీరు కూడా అలాంటి బైక్‌నే వెతుకుతున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్! TVS స్టార్ స్పోర్ట్ అదిరిపోయే బైక్ చీప్ ధరలో దొరకేస్తుంది. మైలేజీలో తోపు అనే చెప్పాలి. ఇక ఫీచర్ల పరంగా కూడా బైక్ టాప్‌గా నిలిచింది. అది మరేదో కాదు TVS స్టార్ స్పోర్ట్. ఈ కంపెనీ బైక్‌లకు ఎంతటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ? అందులో TVS స్టార్ స్పోర్ట్ ఒకటి. ఇది ధరతో పాటు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతి అందిస్తుంది. అంతేకాకుండా మంచి మైలేజ్‌ను కలిగి ఉంటుంది. అద్భుతమైన డిజైన్, అధునాతన ఇంజిన్‌తో సామాన్య ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో అన్‌లాగ్ ఇన్ట్రుమెంట్ క్లస్టర్, హలోజన్ హెడ్‌ల్యాంప్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే అలాగే ఇది 109.7ccతో వస్తుంది. ఇంకా ఎయిర్ కూల్డ్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ వంటి మరిన్నింటిని కలిగి ఉంది. ఇది 4 గేర్ షిఫ్ట్‌ల యూనిట్‌ను కలిగి ఉంది. ఈ బైక్ లీటర్‌కు దాదాపు 70 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో డ్రమ్ బ్రేక్‌లు, డిస్క్ బ్రేక్‌లు, ఏబీఎస్ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా? ఇక లీటర్‌కు 70 కి.మీ మైలేజీ అందించే ఈ బైక్ రూ.68 వేల ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్)తో అందుబాటులో ఉంది. అందువల్లనే ఎక్కువ మంది సామాన్యులు ఈ బైక్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ధర తక్కువ, మైలేజీ ఎక్కువ, అధునాతన ఫీచర్లు ఉండటంతో వీటి సేల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మరి మీరు కూడా ఒక మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే TVS స్టార్ స్పోర్ట్ ఒక మంచి చాయిస్. #tvs-star-sports #tvs #low-price-bikes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి