/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)
stock market today
కొత్త వారాన్ని భారత స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభించాయి. అయితే ఈరోజు నుంచీ రానున్న రోజుల్లో మార్కెట్ ఇలా ఉండకపోవచ్చని అంటున్నారు నిపుణులు. ఆగస్టు 27 అర్ధరాత్రి నుంచి అమెరికా విధించిన అదనపు టారీఫ్ లు 25 శాతం అమల్లోకి రానున్నాయి. వీటి ప్రభావం స్టాక్ మార్కెట్ మీద పడనుంది. ముఖ్యంగా ఈరోజు ఎనిమిది స్టాక్స్ ను గమనించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి. నిఫ్టీ-50 ఇండెక్స్ 0.39% పెరిగి 24,967.75 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 55,139.30 వద్ద ముగిసింది. ఇతర రంగాల సూచీలలో, ఐటీ గణనీయమైన లాభాలను చవి చూశాయి. మార్కెట్లకు రియాల్టీ , కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా మంచి మద్దతు ఇచ్చాయి. దీంతో మిడ్ ,స్మాల్ క్యాప్స్ ఫ్లాట్ నుండి స్వల్పంగా పెరిగాయి.
ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే మొదలవ్వచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 24,700–24,750 మధ్యలో..సెన్సెక్స్ 81, 000 పైన మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు. ఇవి మార్కెట్లో స్థిరమైన కొనుగోళ్లను ఆర్షిస్తాయని హెడ్ - అడ్వైజరీ, పిఎల్ క్యాపిటల్ విక్రమ్ కసత్ తెలిపారు. దాంతో పాటూ సెప్టెంబర్ లో ఫెడ్ రేటు కోత అంచనాలు, పదేళ్ల తరువాత అమెరికా నుంచి దిగుమతుల తగ్గుదల దేశీయ మార్కెట్ పై ప్రభావం చూపించవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఈ కింది స్టాక్స్ మీద దృష్టి పెట్టండి అని చెబుతున్నారు.
ఈరోజు కొనుగోలు చేయాల్సిన స్టాక్స్..
మార్కెట్ నిపుణులు ఛాయిస్ బ్రోకింగ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా, ఆనంద్ రతిలో టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ గణేష్ డోంగ్రే, ప్రభుదాస్ లిల్లాధర్‌లో టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ షిజు కూతుపలక్కల్ లు ఈరోజు మొత్తం ఎనిమిది ఇంట్రాడే స్టాక్ లను సిఫార్స్ చేస్తున్నారు. బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్, డిఎల్‌ఎఫ్ లిమిటెడ్, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్ ,కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ లకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.
బికాజీ స్టాక్ ను ₹ 799.50 కి కొనుగోలు చేయాలని సిఫార్స్ చేస్తున్నారు. ఇందులో స్టాప్ లాస్ ని ₹ 856 టార్గెట్ ధరకు ₹ 771 వద్ద ఉంచుతుందని అంచనా వేస్తున్నారు.
జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ స్టాక్ ను ₹ 800 ధరకు కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. దీనిలో స్టాప్ లాస్‌ను ₹ 772 వద్ద ఉంచి, ₹ 856 లక్ష్య ధరకు కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 812కు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
డీఎల్ఎఫ్ స్టాక్ ను రూ. 771 దగ్గర కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఇది రూ. 790 దగ్గర లక్ష్య ధరకు, రూ. 755 దగ్గర స్టాప్ లాస్ ను ఉంచొచ్చని అంచనా వేస్తున్నారు.
PNB హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్ ను రూ. 800కు కొనుగోలు చేయవచ్చని సిఫార్స్ చేస్తున్నారు. దీని టార్గెట్ ధర రూ. 840 ఉండొచ్చని..స్టాప్ లాస్ రూ. 780 దగ్గర ఉంచుకోవాలని చెబుతున్నారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లేదా B ELను ₹ 372 ధరకు కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. దీని టార్గెట్ ధర రూ. 385 వరకూ వెళ్ళవచ్చని..స్టాప్ లాస్ రూ. 365 దగ్గర ఉంచొచ్చని తెలిపారు.
ఈరోజు స్టాక్ మార్కెట్లో అన్నిటి కంటే ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ ఎక్కువ ధర పలకనుంది. దీనిని రూ. 1845కు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ స్టాక్ టార్గెట్ ధర 1950 వరకు వెళుతుందని..స్టాప్ లాస్ రూ. 1810 దగ్గర ఆగుతుందని చెబుతున్నారు.
క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్..ఈ స్టాక్ ను రూ. 822 దగ్గర కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని టార్గెట్ ధర రూ. 822 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. స్టాప్ లాస్ రూ. 805 దగ్గర ఉన్నప్పుడు గమనించుకోవాలని సూచిస్తున్నారు.
ఇక చివరిది కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ కూడా అత్యధిక ధరకు ట్రేడింగ్ అవనుంది. దీనిని రూ. 2034 దగ్గర కొనుగోలు చేయవచ్చిన చెబుతున్నారు. దీని టార్గెట్ ధర రూ. 2150 వరకు వెళుతుందని..స్టాప్ లాస్ రూ. 1990 దగ్గర ఉంటుందని చెబుతున్నారు. తమ అంచనాలకు మంచి కూడా ఈ స్టాక్ లాభపడే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు.