/rtv/media/media_files/2025/09/14/tomorrow-last-date-for-it-returns-filing-without-penalty-2025-09-14-07-51-23.jpg)
tomorrow last date for IT returns filing without penalty
గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) ఎలాంటి ఫైన్ లేకుండా దాఖలు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటికే దాదాపు 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియ పూర్తి చేశారని ఐటీ విభాగం తెలిపింది. పన్ను చెల్లించేవారికి, పన్ను నిపుణుల సందేహాలు తీర్చేందుకు 24*7 సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అలాగే ఇవెరిఫై అయిన రిటర్నులు 5.51 కోట్లు ఉన్నాయని.. వీటిలో 3.78 కోట్ల వరకు పరిశీలన పూర్తయినట్లు ఐటీ విభాగం వెల్లడించింది.
రూ.3 లక్షలు దాటి ఆదాయం ఉన్నవాళ్లు త్వరగా రిటర్నులు దాఖలు చేసుకోవాలని సూచనలు చేసింది. కొత్త, పాత పన్ను విధానంలో ఏది అవసరమో అది చూసుకోవాలని పేర్కొంది. మోసపూరిత మినహాయింపులను చూపించి, రిఫండును కోరడం తప్పని హెచ్చరించింది. ఆ తర్వాత ఇది నోటీసులకు, భారీ జరిమానాలకు దారి తీస్తోందని వార్నింగ్ ఇచ్చింది.
Also Read: మరోసారి రష్యా, చైనాలపై ట్రంప్ టారిఫ్ బాంబులు.. NATO సభ్యదేశాలకు లేఖ
బ్యాంకు లోన్లు రూ.20 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక ఏడాది(2025-26) లో దేశీయ బ్యాంకుల రుణాల మంజూరు రూ.19-20.5 లక్షల కోట్లు ఉండోచ్చని ఇక్రా నివేదిక పేర్కొంది. 2024-25 తో పోల్చి చూస్తే రుణాల్లో 10.4-11.3 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. అంతేకాదు మౌలిక రంగ సంస్థలకు రుణాలిచ్చేవి తప్ప మిగతా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFC) రుణాల వృద్ధి సైతం 15 నుంచి 17 శాతం ఉండొచ్చని స్పష్టం చేసింది.