/rtv/media/media_files/2025/09/03/gst-2025-09-03-22-28-46.jpg)
GST Effect
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ రేట్ల సవరణ సామాన్యుడి జీవితంలో కీలక మార్పులు తీసుకురానుంది. సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రోజువారీ వినియోగ వస్తువులపై పన్నులు తగ్గించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) పలు ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రేట్ల తగ్గింపు వల్ల వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
తగ్గిన జీఎస్టీ రేట్లు..
హెచ్‌యూఎల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ప్రముఖ ఉత్పత్తులైన డవ్ షాంపూ, హార్లిక్స్, కిసాన్ జామ్, లైఫ్‌బాయ్ సబ్బు వంటి వాటి ధరలు తగ్గుతాయి. ఉదాహరణకు.. గతంలో రూ.490గా ఉన్న 340 ml డవ్ షాంపూ బాటిల్ ధర ఇప్పుడు రూ.435కు తగ్గింది. అలాగే రూ.68 ఉన్న 75 గ్రాముల లైఫ్‌బాయ్ సబ్బు ధర రూ.60కి, రూ.130 ఉన్న 200 గ్రాముల హార్లిక్స్ జార్ ధర రూ.110కి, ర.90 ఉన్న 200 గ్రాముల కిసాన్ జామ్ ధర రూ.80కి దిగి వచ్చింది.
ఇది కూడా చదవండి: లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్: బ్యాంకు కొత్త నిర్ణయం!
ఈ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను వెంటనే వినియోగదారులకు అందించేందుకు.. ప్రభుత్వం ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న వస్తువులపై కూడా ధరలను మార్చేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కంపెనీలు కొత్త స్టిక్కర్లు, ప్రింటింగ్‌ల ద్వారా సవరించిన ధరలను అందుబాటులోకి తేనున్నాయి. ఇది పాత స్టాక్‌ల మీద కూడా జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తుంది. ఈ నిర్ణయంతో వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గడంతోపాటు రాబోయే పండుగల సీజన్‌లో మార్కెట్‌లో కొనుగోళ్లు పెరిగి.. ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎన్నడూ చూడని ఆపర్.. కేవలం రూ.12 వేలకే 43 ఇంచుల స్మార్ట్టీవీ!