Gold Rates: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.7,400 పెరిగి రూ.1,65,000కు చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా  రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నేడు మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,98,300గా ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులుంటాయి. 

New Update
why gold and prices are sky rocketing, Know Details

Gold rates

దేశంలో రోజురోజుకీ బంగారం(Gold Rates), వెండి ధరలు(silver rates) ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. అయితే నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.7,400 పెరిగి రూ.1,65,000కు చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా  రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నేడు మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,98,300గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. 

ఇది కూడా చూడండి: Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!

అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగానే..

అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం వల్ల బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడం ప్రమాదమని భావించే ఇన్వెస్టర్లు.. తమ డబ్బును ‘సేఫ్ హేవన్’గా భావించే బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల మార్కును దాటేసింది. గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం నేరుగా భారత్‌లోనూ కనిపిస్తోంది. దీనికి తోడు దేశంలో పెళ్లి, పండగ అంటే ఫస్ట్ గుర్తుచ్చేది బంగారమే. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు తీరని ఇబ్బంది ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలకు పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులకు భారంగా మారుతోంది. 

Advertisment
తాజా కథనాలు