Postal Life Insurance: అదిరిపోయే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఇక పిల్లల చదువులకు టెన్షనే లేదు!

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.

New Update
postal life insurancy

postal life insurancy

అత్యవసర సమయాల్లో బీమా ప్రతీ ఒక్కరికి ఉపయోగపడుతుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది. సామాన్యులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలాంటి ఇన్సూరెన్స్‌లను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లల చదువు, పెళ్లి ఇలా అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే ఈ పోస్టల్‌లో ఇన్సూరెన్స్ కట్టడం వల్ల బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.  

ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI) అనేది దేశంలోని అత్యంత పాత బీమా పథకాల్లో ఒకటి. ఇది ప్రారంభంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే ఉండేది. కానీ ఇప్పుడు దీని పరిధిని పెంచారు. గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ పథకాల ప్రధాన ఉద్దేశ్యం తక్కువ ఆదాయం ఉన్న వారికి కూడా బీమా రక్షణ కల్పించడం. ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే ఇక్కడ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో ఆ లాభాన్ని పాలసీదారులకు 'బోనస్' రూపంలో ప్రభుత్వం అందిస్తుంది.

ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్‌ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

పోస్టల్ ఇన్సూరెన్స్‌లో బోనస్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది పాలసీ రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్‌లో ప్రతి వెయ్యి రూపాయల సమ్ అష్యూర్డ్ పై సుమారు రూ.76 వరకు బోనస్ లభిస్తుంది. ఎండోమెంట్ అస్యూరెన్స్‌లో ప్రతీ వెయ్యి రూపాయలపై రూ.52 వరకు బోనస్ అందుతుంది. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంటే మీరు చెల్లించే ప్రీమియం తక్కువగా ఉన్నా.. మెచ్యూరిటీ సమయంలో మీకు వచ్చే మొత్తం చాలా భారీగా ఉంటుంది.

ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రయోజనాలు

పాలసీకి అదనపు బలాన్ని చేకూర్చడానికి వివిధ రకాల 'రైడర్స్' సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణిస్తే, నామినీకి అదనపు మొత్తం లభిస్తుంది. ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే, భవిష్యత్ ప్రీమియంల మినహాయింపు లేదా ఆర్థిక సహాయం అందుతుంది. పాలసీ తీసుకున్న నిర్ణీత కాలం తర్వాత అత్యవసర అవసరాల కోసం పాలసీపై తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం ఉంది. గ్రామీణ పోస్టల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 19 ఏళ్ల నుండి 55 ఏళ్ల లోపు వారు ఎవరైనా అర్హులే. దీని కోసం దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రీమియంను ప్రతి నెల పోస్ట్ ఆఫీస్‌లో లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా సులభంగా చెల్లించవచ్చు.

Advertisment
తాజా కథనాలు