/rtv/media/media_files/2025/06/05/VqbEwsoTBCKA7RCmbF3I.jpg)
Tatkal Tickets new Rules
చాలా మంది ప్రయాణికులు దూర ప్రయాణాల కోసం ఎక్కువగా ట్రైన్ జర్నీనే ఎంచుకుంటారు. సౌకర్యవంతం, సేఫ్టీ కారణంగా ట్రైన్‌లోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొంతమంది ముందుగానే టికెట్స్ రిజర్వేషన్ చేసుకోగా.. మరికొందరు తత్కాల్ టికెట్ల పై ఆధారపడుతుంటారు. కానీ చివరి నిమిషంలో టికెట్ బుక్ కాలేదని తీవ్ర నిరాశ చెందుతారు.
ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు
Tatkal Tickets new Rules
నిజానికి చెప్పాలంటే తత్కాల్ టికెట్లను పొందటం చివరి నిమిషం వరకు చాలా పెద్ద సమస్య అనే చెప్పాలి. ఇలా తత్కాల్ బుకింగ్ ఓపెన్ కాగానే.. సెకన్లలో టికెట్స్ ఖాళీ అయిపోతాయి. ఇది ప్రయాణికులకు తీవ్ర నిరాశ కలిగిస్తుంది. అయితే గతంలో ప్రయాణికులు 120 రోజుల ముందుగానే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వీలు ఉండేది. కానీ రైల్వే శాఖ దాన్ని మార్చింది. ఇప్పుడు 60 రోజులకు కుదించింది.
ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు
అందులో 20శాతం టికెట్లు తత్కాల్ మార్గం ద్వారా సేల్ అవుతున్నాయి. చివరి నిమిషంలో జర్నీ చేసేవారి కోసం ఇవి అందుబాటులో ఉంచుతారు. ఈ తత్కాల్ టిక్కెట్లు ప్రయాణం చేసే ఒక రోజు ముందు బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది. అందులో ఏసీ క్లాస్ ప్రయాణికుల బుకింగ్ కోసం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అదే నాన్ ఏసీ ప్రయాణికుల కోసం ఉదయం 11 గంటల నుంచి బుకింగ్ మొదలవుతుంది.
Bharatiya Railways will soon start using e-Aadhaar authentication to book Tatkal tickets.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2025
This will help genuine users get confirmed tickets during need.
ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!
అయితే చాలా చోట్ల ఈ తత్కాల్ టిక్కెట్లను ట్రావెల్ ఏజెంట్లు ఆటోమేట్ బుక్కింగ్ విధానాలతో కొనుగోలు చేసి వాటిని భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని అరికట్టేందుకు కేంద్రం కొత్త ఆలోచనతో ముందడుగు వేసింది. దీని కోసం భారతీయ రైల్వే సంస్థ కొత్తగా ఈ-ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని చూస్తోంది.
ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక పోస్టు పెట్టారు. భారతీయ రైల్వేలు త్వరలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ-ఆధార్ వెరిఫికెషన్ బుకింగ్ సమయంలో తప్పనిసరి చేయనున్నట్లు తెలిపారు. ఇది నిజమైన వినియోగదారులకు అవసరమైనప్పుడు టిక్కెట్లను పొందడానికి సహాయపడుతుంది అని తెలిపారు.