/rtv/media/media_files/2025/09/09/top-shares-2025-09-09-11-03-46.jpg)
ట్రంప్ టారిఫ్ ల దెబ్బ నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్ ప్రస్తుతం పరుగులు తీస్తోంది. గత కొన్ని రోజులుగా ఇండియన్ స్టాక్ మార్కెట్ స్థిరంగా లాభాలను సాధిస్తోంది. సెప్టెంబర్ నెలలో నిఫ్టీ బాగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత వారం నిఫ్టీ 1.3 శాతం పెరిగింది. ఇదే ఊపును ఈ వారం కూడా కంటిన్యూ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దానికి తోడు జీఎస్టీ మార్పులు, రెండు వారాల తర్వాత పండుగ సీజన్ ప్రారంభం అవడం కూడా మార్కెట్ లో జోష్ నింపుతుంది అని చెబుతున్నారు.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. LKP సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే అనాలసిస్.. నిఫ్టీ 21 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే EMA కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. దీని కారణంగా మార్కెట్ ట్రెండ్ స్థిరంగా లేదా స్వల్పంగా సానుకూలంగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగా రూపక్ డే ఈ వారం LKP సెక్యూరిటీస్ అరిస్‌ఇన్‌ఫ్రా, నవీన్ ఫ్లోరిన్, నైకా, IREDA, పవర్ గ్రిడ్, వీనస్ పైప్స్ & ట్యూబ్‌లలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.వీటిల్లో 72% వరకు లాభం పొందే అవకాశం ఉందని చెబుతున్నారు.
అరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్..
దీని షేర్లను రూ.144కి కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. దీని లక్ష్య ధర రూ.164 అవ్వొచ్చని.. అంటే 15% లాభం పొందవచ్చని చెబుతున్నారు. స్టాప్ లాస్‌ను రూ.132 వద్ద ఉంచాలని.. ఈ స్టాక్ బలమైన ట్రెండ్‌లైన్ మద్దతుకు దగ్గరగా ఉందని, సాంకేతిక సంకేతాలు దానిలో పెరుగుదల ఉందని సూచిస్తున్నాయని అంటున్నారు.
నవీన్ ఫ్లోరిన్..
ఈ షేర్లను రూ.4,674 ధరకు కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. దీని టార్గెట్ ధర రూ.5,140 అంటే 10% లాభం వరకూ ఫొందే వకాశం ఉందని చెబుతున్నారు. ఈ షేర్ 3-6 నెలలకు మంచి పెట్టుబడి కావచ్చు. నవీన్ ఫ్లోరిన్ కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని.. ఆర్డర్ బుక్ బలంగా ఉందని.. ఇదే షేర్ ఆదాయానికి హామీగా ఉంటుందని వివరిస్తున్నారు.
Nykaa షేర్లు..
వీటిని రూ.240-244 ధరకు కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. దీని లక్ష్య ధర రూ.266, అంటే 10% లాభం రావొచ్చు. Nykaa బ్యూటీ, జీవనశైలి ఉత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తుంది. ఇటీవలి GST మినహాయింపు ఇంకా పండుగ సీజన్ కారణంగా దీని అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు. కంపెనీ ఫ్యాషన్ వ్యాపారం 2026 నాటికి లాభదాయకంగా మారవచ్చని చెబుతున్నారు.
IREDA షేర్లు..
IREDA షేర్లను రూ.145.89కి కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. దీని లక్ష్యం రూ.160, అంటే 10% లాభం. స్టాప్ లాస్‌ను రూ.137 వద్ద ఉంచాలని.. 2025లో 30% క్షీణత తర్వాత, దీని స్టాక్ 4% లాభపడిందని.. ఇప్పుడు అది పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు
ఈ షేర్లను రూ. 285.50 కు కొనుగోలు చేయడం మంచిది. దీని టార్గెట్ ధర రూ. 305, అంటే 7% లాభం. స్టాప్ లాస్‌ను రూ. 274 వద్ద ఉంచితే మంచిదని సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఇటీవల జరిగిన ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న తర్వాత ఈ PSU స్టాక్ పెరుగుదలను చూస్తోంది.
వీనస్ పైప్స్ & ట్యూబ్స్
ఈ షేర్లను రూ.1,317 కు కొనుగోలు చేయవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. దీని లక్ష్యం రూ.2,260, అంటే 72% లాభం అని చెబుతున్నారు. కంపెనీ బలమైన ఆర్డర్ బుక్, విలువ ఆధారిత ఉత్పత్తులలో పెరుగుతున్న వాటా ఈ షేర్లను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.