/rtv/media/media_files/2025/04/07/365nYg3Pm4GtKaRH8IUm.jpg)
Stock Market Collapse
వరుసగా రెండు రోజులు లాభాలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా సానుకూల ఫలితాలున్నాయి. అయినా కూడా దేశీ మార్కెట్లు మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 82,500 వద్ద ఉండగా.. నిఫ్టీ 50 పాయింట్లు తగ్గి 25,170 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 15 లాభపడగా, 15 నష్టపోయాయి. టాటా మోటార్స్, జొమాటో, హెచ్‌యుఎల్ షేర్లు 1.4% పెరిగాయి. ట్రెంట్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు పడిపోయాయి. ఇక 50 నిఫ్టీ స్టాక్స్‌లో 30 పెరుగుదల చూపిస్తుండగా..20 నష్టాల్లో కదలాడుతున్నాయి. NSE యొక్క నిఫ్టీ మెటల్, ఫార్మా అండ్ హెల్త్‌కేర్ సూచీలు అధికంగా ట్రేడవుతున్నాయి. ఐటీ ఇండెక్స్ 1.50% పడిపోయింది. అమెరికా జపాన్ తో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. దీంతో నిన్న మన మార్కెట్లు కూడా లాభాలతోనే ముగిశాయి. అయితే ఈ కారణంగా మదుపర్లు లాభాలను గెయిన్ చేసుకోవాలని భావిస్తున్నారు. దానివల్లనే ఈరోజు మార్కెట్ డీలా పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ మార్కెట్ పెరుగుతోంది..
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ మంచి జోరులో ఉంది. అమెరికా, జపాన్ ఒప్పంద అక్కడి మార్కెట్లలో జోష్ ను నింపింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 1.97% పెరిగి 41,983 వద్ద, కొరియా కోస్పి 0.39% పెరిగి 3,196 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.39% పెరిగి 25,637 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.48% పెరిగి 3,599 వద్ద ముగిశాయి. ఇక జూలై 23న అమెరికా డౌ జోన్స్ 1.14% పెరిగి 45,010 వద్ద ముగిసింది. అదే సమయంలో, నాస్‌డాక్ కాంపోజిట్ 0.61% పెరిగి 21,020 వద్ద, ఎస్ అండ్ పి 500 0.78% పెరిగి 6,359 వద్ద ముగిశాయి.
Also Read: H-1B Visa: హెచ్ 1 బీ వీసాదారులపై మరో దెబ్బ..గ్రేస్ పిరియడ్ లో ఉంటే ఇంటికే..