Stock Market : రెపో రేట్ల ప్రకటన తర్వాత 270 పాయింట్లు జంప్ అయిన సెన్సెక్స్

రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను యధాతథంగా ఉంచుతున్నామని ప్రకటించాక సెన్స్క్స్ అమాంతం 270 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు పెరిగి 24, 680 దగ్గర ఉంది. 

New Update
stock market

ఈ రోజు ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్ జోరు మీద ఉంది. ఆర్బీఐ రెపో రేట్లను ప్రకటించాక ఇది మరింత వృద్ధి చెందింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పెరిగి 80,500 వద్ద ట్రేడవగా.. నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 24,680 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో పంతొమ్మిది షేర్లు పెరిగాయి. సన్ ఫార్మా, మహీంద్రా, ట్రెంట్ 2% చొప్పున పెరగ్గా.. ఎయిర్‌టెల్, జొమాటో, భారత్ ఎలక్ట్రానిక్స్ స్వల్పంగా క్షీణించాయి. మరోవైపు నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 40 లాభాలతో ట్రేడవుతున్నాయి. NSE ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు 1.5% వరకు పెరిగాయి. మీడియా, ఆటో, రియల్ ఎస్టేట్ కూడా లాభపడ్డాయి. ఐటీ, మెటల్స్ నష్టపోయాయి.

మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్లు...

మరోవైపు ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 1.2% తగ్గి 44,400 వద్ద మరియు కొరియా కోస్పి 0.80% పెరిగి 3,452 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక చైనా జాతీయ దినోత్సవం,  శరదృతువు పండుగ కారణంగా హాంకాంగ్ యొక్క హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్, చైనా యొక్క షాంఘై కాంపోజిట్ అక్టోబర్ 1న మూసివేయబడ్డాయి. సెప్టెంబర్ 29న US డౌ జోన్స్ 0.18% పెరిగి 46,398 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.30%, S&P 500 0.41% లాభపడ్డాయి. సెప్టెంబర్ 30న నగదు విభాగంలో విదేశీ పెట్టుబడిదారులు రూ.2,327.09 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. దేశీయ పెట్టుబడిదారులు  రూ.5,761.63 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు చేశారు.

Also Read: BIG BREAKING: రెండోసారి వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ

Advertisment
తాజా కథనాలు