Stock Market: లాభాల్లో షేర్ మార్కెట్..రాణించిన బ్యాంకింగ్ షేర్లు

చాలా రోజుల తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.  సెన్సెక్స్‌ 363 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి.

New Update
Stock Markets

Stock Market: 

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఈరోజు  17 పెరగ్గా, 13 క్షీణించాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 31 షేర్లు పెరిగాయి.. 18 షేర్లు  క్షీణించాయి. ఒక్క షేర్‌లో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈలో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు అత్యధికంగా పెరిగాయి. మొత్తానికి ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లోకి వచ్చింది. ఉదయం ఫ్లాట్ గా మొదలైన మార్కెట్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. అయితే రోజు చివరలో మార్కెట్ కొనుగోళ్లు అవడంతో నెమ్మదిగా లాభాల బాట ఎక్కింది.  దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు కూడా జోష్‌ను పెంచాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి.

Also Read :  చీరకట్టులో వడ్డిస్తున్న రోబో.. కస్టమర్లు ఫిదా

ఈరోజు ధన్‌తేరస్‌ అవడం కూడా మార్కెట్‌ కు కలిసి వచ్చింది. సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయి 79,421 నుండి 948 పాయింట్లు కోలుకుంది. రోజు ట్రేడింగ్ ముగిసేసరికి 363 పాయింట్ల లాభంతో 80,369 దగ్గర ముగిసింది. నిఫ్టీ కూడా రోజు కనిష్ట స్థాయి 24,140 నుంచి 326 పాయింట్లు కోలుకుంది. 127 పాయింట్ల లాభంతో 24,466 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 80,450 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 363 పాయింట్ల లాభంతో 80,369 వద్ద ముగిసింది.

Also Read :  చిరంజీవి Vs మోహన్ బాబు.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

 ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.77 శాతం లాభపడింది. కొరియా కోస్పి 0.21%, చైనా షాంఘై కాంపోజిట్ 1.08% క్షీణతతో ముగిశాయి. అక్టోబర్ 28న, US డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.65% లాభంతో 42,387 వద్ద మరియు S&P 500 0.27% లాభంతో 5,823 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.26% పెరిగి 18,567కి చేరుకుంది.
NSE డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్ 28న 3,228.08 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో, దేశీయ పెట్టుబడిదారులు 1,400.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు

Also Read: Revanth Reddy: ఏడాదిలో పొలిటికల్ గా కేసీఆర్ ఖతం చేస్తా.. తర్వాత కేటీఆర్.. చిట్ చాట్ లో రేవంత్ సంచలనం

Also Read :  అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'విశ్వం'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు