Viral Video: చీరకట్టులో వడ్డిస్తున్న రోబో.. కస్టమర్లు ఫిదా

కోల్‌కతాలోని బిధాన్‌నగర్ ప్రాంతంలో ఈ వీ మేడమ్ రెస్టారెంట్‌లో చీరకట్టులో రోబో కస్టమర్లకు వడ్డిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. బెంగాలీ సాంప్రదాయ వంటకాలను సాంప్రదాయబద్ధంగా చీరకట్టుకుని మరీ తీసుకొస్తుండటంతో ఈ హోటల్‌కు వచ్చేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు.

New Update
robot

Viral Video

Robot: సాధారణంగా మనం రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తుంటాం. ఒక్కో రెస్టారెంట్‌కు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది.. ప్రత్యేకమైన వంటకాలు కూడా ఉంటాయి. అలాగే కొన్ని థీమ్డ్‌ రెస్టారెంట్లు కూడా ఉంటాయి. ఫారెస్ట్‌, రైలు, జైలు.. ఇలా ఒక్కో రెస్టారెంట్‌కు ఒక్కో స్టైల్‌ ఉంటుంది. మరికొన్ని రెస్టారెంట్లలో రోబోలు వడ్డించడం కూడా చూస్తుంటాం. కోల్‌కతాలోని వీ మేడమ్‌ అనే రెస్టారెంట్‌లో చీరకట్టులో రోబో కస్టమర్లకు వడ్డిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

సాంప్రదాయబద్ధంగా చీరకట్టుకుని..

కస్టమర్లు కోరిన బెంగాలీ సాంప్రదాయ వంటకాలను సాంప్రదాయబద్ధంగా చీరకట్టుకుని మరీ తీసుకొస్తుండటంతో ఈ హోటల్‌కు వచ్చేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. కేవలం రోబోను చూసేందుకైనా రావాలనిపించేలా దాన్ని తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ హోటల్‌ గురించి చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, బ్లాగర్‌లు ఎన్నో వీడియోలు చేశారు. ఇది తినుబండారాలకు ప్రామాణికమైన బెంగాలీ వంటకాలను అందిస్తుంది.

నగరంలోని బిధాన్‌నగర్ ప్రాంతంలో ఈ వీ మేడమ్ రెస్టారెంట్‌ ఉంది. ఒక మహిళా రోబోట్ సంప్రదాయ చీరను ధరించి, మెనూ నుంచి రుచికరమైన వంటకాల ప్లేట్‌ను తీసుకువెళ్లి వినియోగదారులకు అందిస్తున్నట్లు వీడియోలు రికార్డ్ చేశారు. ఇతర రోబోల్లా కాకుండా చూసేందుకు అచ్చం అమ్మాయిలా కనిపించే ఈ రోబో అందరినీ ఆకట్టుకుంటోంది. అందమైన చీరను ధరించడంతోపాటు నెక్లెస్, చెవిపోగులు, బిందీ, లిప్‌స్టిక్ వంటివి పెట్టి నిర్వాహకులు రోబోను తీర్చిదిద్దారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

ఇది కూడా చదవండి: వాటర్ ఫాస్టింగ్‌తో త్వరగా బరువు తగ్గొచ్చా..?

Advertisment
తాజా కథనాలు