సంక్రాంతికి ఏపీ వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. స్పెషల్ వందేభారత్!

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఇండియన్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్-వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో (No. 20707/20708) కోచ్ లను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది.

New Update
Sankranthi Special Trains

Sankranthi Special Trains

సికింద్రాబాద్-వైజాగ్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ ట్రైన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. వాటిని ప్రయాణికుల నుంచి భారీగా ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఆయా రూట్లో ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. Tr No. 20707 / 20708 సికింద్రాబాద్-వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో కోచ్ ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి:BIG BREAKING: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!

ఇప్పటి వరకు ఈ ట్రైన్లో 8 కోచ్ లు మాత్రమే ఉండగా.. ఆ సంఖ్యను 16కు పెంచుతున్నట్లు వెల్లడించింది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం ఉన్న చైర్ కార్ కోచ్ లను 7 నుంచి 14కు పెంచినట్లు రైల్వే ప్రకటనలో పేర్కొంది. దీంతో ప్రస్తుతం 530గా ఉన్న సీటింగ్ సామర్థ్యం 1128కి చేరినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సీట్ల పెంపు ఈ నెల 13 నుంచి అమల్లోకి రానుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. 
ఇది కూడా చదవండి:పేదలకు చేయూత.. సంక్రాంతి పండక్కి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు

సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే పదుల సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అయినా ప్రయాణికుల రద్దీ తగ్గలేదు. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) చర్లపల్లి - విశాఖపట్నం మధ్య 6 జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు