Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ ధరలకు రెక్కలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.

New Update
Silver, Gold Futures Rally As Global Rebound, Weak Dollar Lift Metals

Silver, Gold Futures Rally As Global Rebound, Weak Dollar Lift Metals

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధర(gold and silver rate today) లకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రూ.11 వేలు పెరిగింది. మరోవైపు మేలిమి పసిడి ధర ఏప్రిల్ కాంట్రాక్ట్‌ 1.3 శాతం పెరిగి రూ.1,57,540కి చేరింది. అంటే రూ.2 వేల వరకు పెరిగింది. 

Also Read: దారుణం.. తోటి విద్యార్థిని కాల్చి చంపి సూసైడ్‌ చేసుకున్న స్టూడెంట్.. వీడియో వైరల్

Silver - Gold Futures Rally

ఇక అంతర్జాతీయ విపణిలో స్పాట్‌ గోల్డ్‌ ధర 5 వేల డాలర్లను క్రాస్ చేసింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఔన్సు బంగారం ధర 5004 డాలర్లు ఉండగా.. వెండి ఔన్సు 81 డాలర్ల వరకు ట్రేడవుతోంది. దీంతో దేశీయంగా కూడా వీటి ధరలు పెరిగిపోయాయి. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో వీటి ధర రూ.1.60 లక్షలు ఉంటే.. వెండి ధర రూ.2.70 లక్షల పైనే ఉంది. ఇటీవల బంగారం, వెండి ధరలు(gold and silver news today) భారీగా పెరిగినా ఆ తర్వాత మళ్లీ దిగిపోయాయి. వెండి సగం వరకు పతనైపోయింది. మళ్లీ వీటి ధరలు పెరుగుతున్నాయి. 

Also Read: ఢిల్లీకి రానున్న సుందర్ పిచాయ్, శామ్‌ ఆల్ట్‌మన్.. హోటల్‌ ధరలకు రెక్కలు.. ఒక్క రోజుకు రూ.32 లక్షలు

ఇదిలాఉండగా చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా వరుసగా 15 నెల పెద్దమొత్తంలో పసిడిని కొనుగోలు చేస్తోంది. దీంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ఈ వారం బయటికి రానున్న అమెరికా ఉద్యోగ, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా బంగారం, వెండి ధరలు ప్రభావితం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు