Upcoming Cars: సెప్టెంబర్‌లో కార్ల జాతరే.. మొత్తం ఎన్ని లాంచ్ అవుతున్నాయంటే?

ఈ సెప్టెంబర్ నెలలో పలు కంపెనీలు తమ కార్లను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్నాయి. అందులో వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ VF6, VF7 SUVలను ఒకేసారి విడుదల చేస్తుంది. అలాగే మారుతి ఎస్కుడో SUV, థార్ ఫేస్‌లిఫ్ట్ సహా మరిన్ని కార్లు లాంచ్ కానున్నాయి.

New Update
Upcoming Cars (1)

Upcoming Cars:

ప్రతీ ఏడాది ఆటో మొబైల్ కంపెనీలు తమ కొత్త కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నెల ముగిసిన తర్వాత నెలలో తమ వాహనాలను లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆగస్టు నెల ముగిసి సెప్టెంబర్ నెల వచ్చేసింది. ఆగస్టు నెలలో పలు కార్లు దేశీయ మార్కెట్‌లోకి వచ్చి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లో కూడా మరిన్ని కంపెనీలు తమ కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. 

Also Read:కవితకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్

Upcoming Cars

మరీ ముఖ్యంగా దీపావళికి ముందు వాహనం కొనడం శుభప్రదంగా చాలా మంది భావిస్తారు. అదే సమయంలో పలు కంపెనీలు ఈ సందర్భంగా కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 2025 భారతీయ కార్ ప్రియులకు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. అనేక పెద్ద కంపెనీలు తమ కొత్త SUVలు, ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయబోతున్నాయి. ఈ నెలలో విడుదల కానున్న కార్లు ఏంటో?.. వాటి ప్రత్యేకతలేవో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read:ముఖ్య అతిథులుగా ముస్లింలు.. 35 ఏళ్ల తర్వాత పురాతన ఆలయాన్ని తెరిచిన కశ్మీరీ పండితులు

విన్‌ఫాస్ట్ 

వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లోకి కొత్త మోడళ్లను తీసుకురాబోతుంది. సెప్టెంబర్ 6న కంపెనీ రెండు SUVలు VF6, VF7లను ఒకేసారి విడుదల చేస్తుంది. VF6లో 59.6 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది దాదాపు 480 కి.మీ. పరిధిని ఇస్తుంది. అదే సమయంలో VF7లో 70.8 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది దాదాపు 450 కి.మీ మైలేజీ అందిస్తుంది. తమిళనాడులోని టుటికోరిన్ ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేయనున్నారు. కాగా విన్‌ఫాస్ట్ భారత EV మార్కెట్‌లో పోటీని మరింత పెంచుతుందని పలువురు భావిస్తున్నారు. 

మారుతి ఎస్కుడో SUV

మారుతి సుజుకి తన కొత్త SUV ఎస్కుడోను సెప్టెంబర్ 3న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారు గ్రాండ్ విటారా కంటే పెద్దదిగా ఉంటుంది. దీనికి బలమైన హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది. దీని ధర దాదాపు రూ.10 లక్షల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మారుతి తన అరీనా నెట్‌వర్క్ ద్వారా ఈ మోడల్‌ను విక్రయిస్తుంది. 

Also Read: నన్నెవరేం పీకలేరు..బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్

మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా ప్రసిద్ధ ఆఫ్-రోడ్ SUV థార్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించబడుతుంది. ఇది కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అయితే ఇంజిన్ ఎంపికలు అలాగే ఉంటాయి. ఈ అప్డేట్‌లు వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని మరింత సరదాగా చేస్తుంది. 

సిట్రోయెన్ బసాల్ట్ X

సిట్రోయెన్ తన కొత్త SUV బసాల్ట్ X ను సెప్టెంబర్ మధ్యలో విడుదల చేయనుంది. దీని ప్రీ-బుకింగ్ ఆగస్టు 22 నుండి ప్రారంభమైంది. కేవలం రూ.21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది కొత్త కలర్ స్కీమ్, అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంజిన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్‌తో వస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 

Also Read: పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్

వోల్వో EX30

ఈ సెప్టెంబర్‌లో విడుదల కానున్న మరో ఎలక్ట్రిక్ కారు వోల్వో EX30. ఇది 69 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 480 కి.మీ WLTP మైలేజీని కలిగి ఉంటుంది. అలాగే 150 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో దీని బ్యాటరీ కేవలం 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ కారు పవర్‌ట్రెయిన్‌పై వోల్వో 8 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ధర దాదాపు రూ. 50 లక్షలు ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు వోల్వోలో అత్యంత సరసమైన EVగా పరిగణించబడుతుంది.

Advertisment
తాజా కథనాలు