Revanth Reddy : రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రముఖ కంపెనీ బిగ్ షాక్.....యూనిట్ ఏర్పాటుపై వెనక్కి.....
రేవంత్ రెడ్డి సర్కారుకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను సంస్థ ఖండించింది. హైదరాబాద్లో ప్లాంట్ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
Flying Cars: కార్లకు రెక్కలు వచ్చాయ్.. ఇకపై గాల్లో తేలుతూ వెళ్లొచ్చు..
గాల్లో ఎగిరే కార్లని తయారు చేసింది కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం, ఈ కార్ ధర సుమారు రూ.2.5 కోట్లు ఉండే అవకాశం ఉంది. 2025 చివర్లో దీన్ని మార్కెట్లో విడుదల చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.
Tesla In India: టెస్లా కోసం ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్ చేతులు కలుపుతారా?
ఎలాన్ మస్క్ తన టెస్లా ఈవీలను భారత్ కు తీసుకురావడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీతో పెద్ద డీల్ ఆయన కుదుర్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. టెస్లా భారత్ లో ప్రవేశిస్తే అది టాటా ఈవీలకు గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
China vs America: చైనా ఎలక్ట్రిక్ కార్లతో గూఢచర్యం చేస్తోంది.. అమెరికా ఆరోపణలు..
ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలుగా అవతరించే ప్రయత్నాల్లో ఉన్నాయి అమెరికా, చైనా. ఈ నేపధ్యంలో అమెరికా ఆధిపత్య యుద్దానికి తెరతీసింది. చైనా ఎలక్ట్రిక్ కార్లతో గూఢచర్యం చేస్తోంది అంటూ ఆరోపించింది.