Stock Markets Today:
5 నెలల్లో ఈరోజు మార్కెట్లో అతి పెద్ద ర్యాలీ జరిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు జూన్ 3న సెన్సెక్స్ 2,507 పాయింట్లు ఎగబాకి 76,468 వద్ద ముగిసింది. నిఫ్టీ 733 పాయింట్లు పెరిగి 23,263 వద్ద ముగిసింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు సెన్సెక్స్ అమాంతం 2000 పాయింట్లు పైకెగిసి లాభపడింది. మరోవపు నిఫ్టీ కూడా 550 పాయింట్లకు పైగా లాభపడింది. ఈరోజు ముగిసేసరికి సెన్సెక్స్ 1961 పాయింట్ల (2.54%) పెరుగుదలతో 79,117 దగ్గర.. నిఫ్టీ కూడా 557 పాయింట్లు (2.39%) పెరిగి 23,907 వద్ద క్లోజ్ అయ్యాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 29 పెరగ్గా..ఒక్కటి మాత్రమే క్షీణించింది. ఇక 50 నిఫ్టీ స్టాక్‌లలో 49 పెరిగాయి.. 1 క్షీణించింది. నిఫ్టీ మీడియా మినహా, ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. ఐటీ, రియల్టీ సూచీలు అత్యధికంగా పెరిగాయి.
ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్!
ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?
ఈరోజు మార్కెట్ కళకళలాడ్డానికి కారణం అనూహ్యంగా పెరిగిన కొనుగోళ్ళు అని చెబుతున్నారు నిపుణులు. దాంతో పాటూ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజులో దాదాపు రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.432 లక్షల కోట్లకు చేరింది. బిఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.432 లక్షల కోట్లకు చేరుకుంది. నవంబర్ 21 నాటికి ఇది దాదాపు రూ.425 లక్షల కోట్లుగా ఉంది.ఇక నిన్న భారీ నష్టల్లోకి నెట్టేసిన అదానీ స్టాక్స్ ఈరోజు పుంజుకున్నాయి. అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీలలో 6 కంపెనీల షేర్లు పెరిగాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నేడు 2% పెరిగింది.
Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు
ఇది కూడా చూడండి: AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?