ఈరోజు స్టాక్ మార్కెట్ తెగ ఊగిసలాడింది. స్వల్ప నష్టాలతో మొదలైన మార్కెట్ మధ్యలో కాస్త కోలుకున్నట్టు కనిపించింది. కానీ చివరికి భారీ నష్టాలలో ముగిసింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతలో ఇంట్రాడే లోస్ కు వెళ్లి కోలుకున్నట్లే కనిపించినా.. ఒక్కసారిగా పడిపోవడంతో లక్షల కోట్లు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ సుమారు 1064 పాయింట్లు పడిపోయి 80,684 వద్ద నిలిచింది. దీంతో బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2.33 లక్షల కోట్లు పడిపోయి 258 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా నిఫ్టీ కూడా 332 పాయింట్లు పతనమై 24,336 వద్ద ముగిసింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 311 పాయింట్ల పతనంతో 47,816 వద్ద ముగిసింది. లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి.. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 29 క్షీణించాయి.. 1 పెరిగింది. 50 నిఫ్టీ స్టాక్స్‌లో, 49 బాగా డౌన్ అయిపోయాయి. ఒక స్టాక్ మాత్రమే లాభాలతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. నిఫ్టీ PSU బ్యాంక్ 1.88% అతిపెద్ద పతనంతో ముగిసింది. ఇది కాకుండా నిఫ్టీ మెటల్, బ్యాంక్, ఆటో, ఫార్మా కూడా దాదాపు 2% క్షీణించాయి. దీంతో లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. ఇక ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.24%, కొరియా కోస్పి 1.29% నష్టపోయాయి. చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.73 శాతం నష్టపోయింది. ఇక నిన్న అమెరికా మార్కెట్‌లో డోజోన్స్ 0.032% పడిపోయి 43,754 దగ్గర ముగిసింది. S&P 500 0.38% పెరిగి 6,074 దగ్గర..నాస్‌డాక్ 1.24% పెరిగి 20,173 వద్ద ఉన్నాయి. Also Read: హాయిగా ఉండు..పెళ్ళి చేసుకో..లవర్‌కు మెసేజ్ పెట్టి యువతి ఆత్మహత్య Also Read: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా