Reliance Jio IPO:
ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద ఐపీవోగా రిలయెన్స్ జియో ఐపీఓ అవతరించనుంది. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ టెలికం సంస్థ జియో.. ఐపీఓ ద్వారా 100 బిలియన్ల డాలర్ల పై చిలుకు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025లో ఐపీఓకు వెళ్లాలని రిలయన్స్ జియో వెళ్లనున్నదని, అటుపై వచ్చే ఏడాది చివర్లో రిలయన్స్ రిటైల్ సైతం ఐపీఓ ద్వారా నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. దీని ద్వారా 11 బిలియన్ డాలర్లను సేకరించాలని ముఖేష్ అంబానీ ప్లాన్ వేస్తున్నారు.
అయితే ఇప్పటికి వరకు ఈ ఐపీఓల గురించి కంపెనీ ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన చర్చ పూర్తిగా అంతర్గతంగా జరుగుతోంది. భారత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది అక్టోబర్ కు 270 కంపెనీలు ఐపీఓల ద్వారా లిస్టింగ్ కావడంతోపాటు 12.58 బిలియన్ డాలర్ల నిధులు సేకరించాయి. గతేడాది ఐపీఓల ద్వారా వివిధ సంస్థలు సేకరించిన నిధులు 7.42 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇక జియో విషయానికి వస్తే.. టెలికాం, డిజిటల్ బిజినెస్‌ల వేదిక అయిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోని 17.84 బిలియన్ల డాలర్లతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. ఇవి జియో ప్లాట్‌ఫామ్స్‌లో 33 శాతంగా ఉన్నాయి. అసలు రిలయన్స్ రిటైల్ సంస్థలో 7.44 బిలియన్ డాలర్ల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లదే. ఇది మొత్తం రిలయన్స్ రిటైల్ మొత్తం విలువలో సుమారు 12 శాతంగా ఉంది.
Also Read : ఒక్కసారిగా సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్.. లాభాల్లో సూచీలు
ఇండియన్ టెలికాం చరిత్రనే మార్చేసింది జియో. 479 మిలియన్ల కస్టమర్లతో ప్రస్తుతం టాప్ ఆపరేటర్‌గా జియో ఉంది. అందుకే ఇప్పుడు జియో ఐపోలను విడుదల చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. 2019లోనే జియోను స్థాపించినప్పుడు ఐదేళ్ళ తర్వాతైపీవోలను విడుదల చేస్తామని ముఖేశ్ ప్రకటింఆరు అన్నట్టుగానే ఇప్పుడు 2025లో ల్యాండ్ మార్క్‌గా జియో ఐపీవోలను తీసుకురానున్నారు. జియో ఐపీవో విలువ 112 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. జియోలో 67 శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా ఉంది. IPO ద్వారా పెట్టుబడిదారులకు ఎగ్జిట్ ఆప్షన్ కల్పించనున్నారు.ప్రస్తుతం ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో 3.3 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్‌తో హ్యూందాయ్ ఇండియా ఐపీవో ఉంది. ఈ రికార్డును అధిగమించాలనేది ఇప్పుడు జియో టార్గెట్ గా పెట్టుకుంది.
Also Read: Business: ఒక్కసారిగా సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్.. లాభాల్లో సూచీలు