Realme P3 Ultra 5G: బుర్రపాడు బ్రో.. రియల్‌మీ కొత్త ఫోన్ కిర్రాక్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

టెక్ బ్రాండ్ రియల్‌మి మరో కొత్త ఫోన్‌ లాంచ్ చేసింది. Realme P3 Ultra 5G భారత్‌లో రిలీజ్ అయింది. దీని 8/128GB-రూ.26,999, 8/256GB-రూ.27,999, 12/256GB-రూ.29,999గా నిర్ణయించారు. నేటి నుండి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

New Update
Realme P3 Ultra 5G launched in India

Realme P3 Ultra 5G launched in India

ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మి భారతదేశంలో తనదైన శైలిలో దూసుకుపోతుంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అదగొడుతోంది. తాజాగా ఈ కంపెనీ భారతదేశంలో రియల్‌మి పి3 సిరీస్‌లో రియల్‌మి పి3 అల్ట్రా 5జి (Realme P3 Ultra 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.83-అంగుళాల 1.5K 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే సమయంలో MediaTek Dimensity 8350 Ultraతో వస్తుంది. ఇప్పుడు దీని వేరియంట్స్, ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

Realme P3 Ultra 5G Price

Realme P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.

8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999

8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999

12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999.

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

ఈ ఫోన్ నేటి నుండి realme.com, Flipkart, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లలో కస్టమర్లకు బ్యాంక్ కార్డులపై రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపు ఉన్నాయి. దీనితో పాటు 1 సంవత్సరం వారంటీ, 6 నెలల పాటు నో-కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..

Realme P3 Ultra 5G Specifications

Realme P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ 6.83-అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i సేఫ్టీతో అమర్చబడింది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌ను అందించారు.

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి UI 6.0 పై పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. P3 అల్ట్రా 5G వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు