BIG BREAKING: ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!

నిబంధనలు పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అహ్మదాబాద్‌లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ గత నెల రద్దు చేసింది. ఇప్పుడు లక్నోలోని HCBL కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

New Update
RBI

RBI

నిబంధనలు పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. ఇటీవల SBI, PNB వంటి పెద్ద బ్యాంకులపై కూడా RBI జరిమానాలు విధించింది. అయితే అహ్మదాబాద్‌లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ గత నెల రద్దు చేసింది. ఇప్పుడు లక్నోలోని HCBL కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. బ్యాంకు వద్ద తగినంత మూలధనం, ఆదాయ సామర్థ్యం లేదని RBI రద్దు చేసింది. 

ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..

రూల్స్ పాటించలేదని..

బ్యాంకును మూసివేసి, లిక్విడేటర్‌ను నియమించాలని ఆదేశించాలని ఉత్తరప్రదేశ్ సహకార కమిషనర్, రిజిస్ట్రార్‌ను ఆర్బీఐ కోరింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి ప్రతీ డిపాజిటర్ రూ.5 లక్షల వరకు బీమా క్లెయిమ్ పొందుతారు. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులోని 98.69% డిపాజిటర్లు తమ మొత్తం డిపాజిట్ మొత్తాన్ని డిఐసిజిసి నుండి పొందగలుగుతారు.

ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

జనవరి 31, 2025 నాటికి, DICGC ఇప్పటికే రూ.21.24 కోట్లు చెల్లించింది. HBL బ్యాంక్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని కొన్ని నియమాలను పాటించలేదని RBI తెలిపింది. అహ్మదాబాద్‌లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. తగినంత మూలధనం లేకపోవడం, తక్కువ ఆదాయ సామర్థ్యం అని ఆర్బీఐ తెలిపింది.

 

rbi-cancels-bank-licence

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు