/rtv/media/media_files/2025/09/16/tax-2025-09-16-10-49-39.jpg)
ఇప్పటివరకు ఐటీఆర్ (Income Tax Returns) దాఖలు చేయనివారికి గుడ్ న్యూస్. దాఖలు గడువును పొడిగిస్తూ ఇన్‌కంటాక్స్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరొక రోజు గడువును పొడిస్తున్నామని ప్రకటించింది. ఐటీ శాఖ కనికరించినా..పోర్టల్ మాత్రం ఇంకా పని చేయడం లేదు. ఏ సమస్య ఉందని గడువును పెంచిందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. చివరి రోజు అయిన నిన్న మిస్ అయిన వాళ్ళందరూ ఈ రోజు ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వెబ్ సైట్ పదే పదేమొండికేస్తోంది. ఒకవేళ పనిచేసినా చాలా స్లోగా పని అవుతోంది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పైగా ఈ ఒక్క రోజే గడువు ఉండడంతో టెన్షన్ ఫీల్ అవుతున్నారు. లాస్ట్ రోజున రిటర్న్స్ దాఖలు చేసే వారి భారీగా పెరిగింది. దీంతో వెబ్ సైట్ కు లోడ్ కూడా పెరిగిపోయింది. అందుకే ప్రోసెస్ చాలా నెమ్మది అవుతోందని ఐటీ శాఖ చెబుతోంది. అయితే ఈ రోజు తర్వాత మాత్రం ఇంక గడువు పెంచేదే లేదని తేల్చి చెప్పేసింది.
ఐటీ రిటర్న్ చివరి తేదీలు..
అందరూ ఒకే రకమైన పన్ను చెల్లించారు. ఇందులో చాలా రకాలున్నాయి. ఐటీ శాఖ కూడా వాటిని బట్టే చివరి తేదీలను నిర్ణయించింది. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు , చిన్న వ్యాపారాలు వంటి పన్ను ఆడిట్ అవసరం లేని వారికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16 గా నిర్ణయించారు. ఆడిట్ అవసరమయ్యే వారికి అక్టోబర్ 31వ తేదీ చివరి రోజు. చెల్లింపుదారులు ఎవరైనా బదిలీ ధరల నివేదికను దాఖలు చేస్తే వారు నవంబర్ 30లోగా తన కేటగిరీ ప్రకారం సరైన ఐటీఆర్ఫారమ్‌ను (ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-4 వంటివి) ఎంచుకుని రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 16 లోపు రిటర్న్స్ దాఖలు చేయలేకపోతే వారు ఫైన్ తో పాటూ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా ఆఖరి తేదీ డిసెంబర్ 31, 2025. ఐదు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే వెయ్యి...అంత కంటే ఎక్కువ ఉంటే 5 వేల రూపాయలను జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
2025-26 ఏడాదికి గాను ఐటీఆర్ దాఖలు చేసేందుకు జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు అంటే నిన్నటి వరకు డెడ్‌లైన్ విధించింది. ఆ మేరకు సోమవారంతో ఆ గడువు పూర్తయింది. కాగా ఆశించిన మేరకు సెప్టెంబర్ 15 వరకు రికార్డు స్థాయిలో 7.3 కోట్లకు పైనేఐటీఆర్ ఫైలింగ్‌లు జరిగినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. గతేడాది జరిగిన ఐటీఆర్ ఫైలింగ్‌లు 7.27 కోట్లు కాగా ఈసారి దాన్ని అధిగమించినట్లు తెలిపింది. కాగా పెంచిన గడువు బట్టి మంగళవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల వరకు ఈ-ఫైలింగ్ పోర్టల్ మెయింటనెన్స్ మోడ్‌లో ఉంటుంది. మార్పు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉందని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
Also Read: AI Saree Trend: వామ్మో..వ్యక్తిగత వివరాలను బయటపెడుతున్న బనానా ఏఐ చీర ట్రెండ్