/rtv/media/media_files/2025/06/06/MLBD0MAc1O73pnOMUm1p.jpg)
PhonePe acquires GSPay to launch UPI payments for new feature phone users
ఫోన్ పే అతి తక్కువ సమయంలో బాగా పాపులర్ అయిపోయింది. ఎవ్వరి ఫోన్లలో చూసినా ఫోన్‌పే కనిపిస్తుంది. ఇప్పుడీ ఈ పేమెంట్ యాప్ ఫోన్లలో లేకపోతే బయట ఏం కొనాలన్నా చాలా కష్టం. అలా మార్చేసింది. ఈ యాప్ సాయంతో మనీ ట్రాన్సఫర్, మనీ రిసీవ్, వస్తువులు కొనేటప్పుడు పేమెంట్ చేయడం వంటివి చేసుకోవచ్చు.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
కీప్యాడ్ ఫోన్లలోకి ఫోన్ పే
అయితే ఇప్పటి వరకు ఇది కేవలం స్మార్ట్ఫోన్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపై కీప్యాడ్ ఫోన్లలోనూ రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే కీప్యాడ్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ చెల్లింపు సేవల్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మరో అడుగు ముందుకు వేసింది. GS PAY టెక్నాలజీ కన్వర్జేషనల్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ గప్‌చుప్‌ను కొనుగోలు చేసింది.
భారత్‌లో రానున్న త్రైమాసికంలో కొత్త కీ ప్యాడ్ మొబైల్స్ కోసం UPI మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ స్వయంగా వెల్లడించింది. కాగా GS PAY అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన UPI 123PAY ఆధారంగా వర్క్ చేస్తుంది. దీనర్థం.. కీప్యాడ్ ఫోన్లు వాడేవారికి UPI సేవలు అందించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
Also Read: 'నేను దొంగను కాదు'.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ మాల్యా
ఈ కొత్త యాప్ ద్వారా పీ2పీ ట్రాన్సక్షన్స్, ఆఫ్‌లైన్ క్యూఆర్ ట్రాన్సక్షన్స్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా దీనితో పాటు ఇతర యూపీఐ వినియోగదారుల నుంచి ఫోన్ నెంబర్ ద్వారా ట్రాన్సక్షన్స్ చేసుకునే వీలు ఉంటుంది. అదే సమయంలో ఈ కీప్యాడ్ ఫోన్లు, స్మార్ట్ఫోన్ల మధ్య చెల్లింపులు చాలా ఈజీ అవుతాయి.
Also Read: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహం
tech-news | phonepay | telugu tech news