/rtv/media/media_files/2026/02/01/budget-2026-02-01-19-47-21.jpg)
Over 95,000 crores allocated for VB-G RAM G, MGNREGA gets 30,000 crores in Budget
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌కు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా మార్చిన ఉపాధి హామీ పథకమనైన "వికాసిత్ భారత్-జీ రామ్ జీ'' కోసం రూ.95,692 కోట్లు బడ్జెట్ కేటాయించారు. గతేడాది MGNREGA కోసం కేంద్రం రూ.86 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఈసారి ఈ కొత్త స్కీమ్ కోసం బడ్జెట్‌ను పెంచింది. ఇటీవల మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం.. వికాసిత్ భారత్-జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. MGNREGA కోసం కూడా రూ.30,000 కోట్లు కేటాయించారు. ఇది కేవలం పాత బకాయిలు చెల్లించడానికి, కొత్త పథకం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే వరకు మాత్రమే. అంటే సుమారు 6 నెలల వరకు ఇది కొనసాగుతుంది.
Also Read: 'గర్ల్స్ హాస్టల్' నుండి 'She Mart' వరకు.. బడ్జెట్లో మహిళలకు 3 వరాలు!
ఈ కొత్త పథకం కింద ఉపాధి కాలాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఉపాధి కార్మికులు బయోమెట్రిక్‌తో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. వేతనాలు కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడతాయి. గతంలో MGNREGA కింద కేంద్రమే మెజార్టీ నిధులు కేటాయించేది. కానీ ఇప్పుడు 60:40 నిష్పత్తిని తీసుకొచ్చారు. అంటే కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు భరించాల్సి ఉంటుంది.
Also Read: కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కేవి ఇవే.. పూర్తి వివరాలు
ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు మాత్రం 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ స్కీమ్ కింద చేసే పనులను నాలుగు ముఖ్య విభాగాలుగా విభజించారు. 1.జల భద్రత, 2.గ్రామీణ మౌలిక సదుపాయాలు, 3.జీవనోపాధి కల్పన, 4.విపత్తు నిర్వహణ. అయితే ఈ పథకం వల్ల కార్మికులకు పని దినాలు పెరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందనే దానిపై వివాదం నడుస్తోంది.
Follow Us