October New Rules: గ్యాస్ సిలిండర్ నుంచి బ్యాంకింగ్, ట్రైన్ టికెట్ల బుకింగ్ వరకు.. నేటి నుంచి మారే రూల్స్ ఇవే!

అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్, రైలు టిక్కెట్లు, వడ్డీ రేట్లు, UPI, నేషనల్ పెన్షన్ సిస్టమ్, గ్యాస్ ధరలు మారనున్నాయి. ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు నేటి నుంచి అమల్లోకి రానుంది.

author-image
By Kusuma
New Update
October 1st

October 1st

ప్రతీ నెల కొన్ని ముఖ్యమైన రూల్స్ మారుతుంటాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తప్పకుండా మారుతాయి. అయితే అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్, రైలు టిక్కెట్లు, వడ్డీ రేట్లు, UPI, పెన్షన్ ప్లాన్‌లలో మార్పులు చేశారు. మరి ఆ మార్పులేంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Mutual Funds: అదిరిపోయే స్కీమ్.. లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.11 లక్షలు ఎలాగంటే?

ఆన్‌లైన్ గేమింగ్

ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో మోసపోకుండా ఉండేందుకు.. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1న ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు అమల్లోకి రానుంది. దీనివల్ల ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి ఆడే గేమ్స్ అన్ని బ్యాన్ అవుతాయి. 

రైలు టికెట్ బుకింగ్

ఎప్పటికప్పుడు రైల్వే టికెబ్ బుకింగ్స్‌లో మార్పులు వస్తుంటాయి.  అయితే అక్టోబర్ 1 నుంచి రైలు టికెట్ బుకింగ్, వాపసు రూల్స్‌లో కొన్ని మార్పులు చేశారు. ఆధార్ వెరిఫికేషన్ ఉన్నవారు మాత్రమే ఫస్ట్ రిజర్వేషన్ చేసుకోవాలనే రూల్‌ను తీసుకొచ్చింది. అంటే బుకింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 నిమిషాల్లోనే తప్పకుండా బుక్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యి ఉండాలి.

బ్యాంకింగ్ రంగం

వడ్డీ రేట్లు, రుణాలు, ఫిక్సిడ్ డిపాజిట్లు, పొదుపు పథకాలలో మార్పులు కూడా మారనున్నాయి. పెట్టుబడిదారులు తప్పకుండా మార్పులను తెలుసుకుని పెట్టాలి. 

UPI చెల్లింపు

యూపీఐ పేమెంట్స్‌లో అక్టోబర్ 1 నుంచి పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్‌ను బ్యాన్ చేయనున్నారు. అంటే యూపీఐ ఐడీ ద్వారా ఒకరి నుంచి మరికొరికి పేమెంట్ చేయడానికి కుదరదు. వినియోగదారుల సేఫ్టీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కాన్ లేదా నెంబర్ ద్వారా మాత్రమే ఇకపై పేమెంట్ చేసుకోవచ్చు. 

గ్యాస్ ధరలు

ప్రతీ నెల ఒకటో తారీఖున LPG సిలిండర్ల ధర మారనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల కూడా మారుస్తుంటాయి. 

నేషనల్ పెన్షన్ సిస్టమ్

నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులు ఈక్విటీలలో వంద శాతం వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. వీరితో పాటు ప్రభుత్వేతర చందాదారులు కూడా తమ పెన్షన్ మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. 

ఇది కూడా చూడండి: VerSe Innovation: లాభాలతో దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్.. రూ.2 వేల కోట్లకు పెరిగిన ఆదాయం!

Advertisment
తాజా కథనాలు