EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

New Update
New EPFO app to allow members to withdraw EPF money through UPI

New EPFO app to allow members to withdraw EPF money through UPI

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. EPFలో కొంత భాగాన్ని మినహాయించి మెజార్టీ వాటాను చందాదారులు తమ బ్యాంకు అకౌంట్‌లోకి UPI ద్వారా విత్‌డ్రా చేసుకునే ప్రాజెక్టుపై కార్మిక శాఖ పనిచేస్తోంది.  

Also Read: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే బుక్‌ వివాదం.. ఆ బుక్‌లో ఏముందో తెలుసా ?

ఈ యాప్‌లో చందదారులు తమ డబ్బును విత్‌డ్రా చేసుకోవడంతో పాటు పాస్‌బుక్‌ బ్యాలెన్స్‌ లాంటి సేవలు కూడా పొందవచ్చు. అలాగే బ్యాంకు అకౌంట్‌లకు బదిలీ చేసేందుకు ఎంత ఈపీఎఫ్‌ అందుబాటులో ఉందనే వివరాలను తెలుసుకోవచ్చు. లావాదేవీలు పూర్తి చేసేందుకు, వాళ్ల బ్యాంక్ అకౌంట్‌లకు నిధులు సేఫ్‌గా వెళ్లేందుకు లింక్ చేసిన UPI పిన్‌ను వాడాల్సి ఉంటుంది.  

మరోవైపు ఈ సేవలు మెరుగుపర్చేందుకు, సాంకేతిక లోపాలను తొలగించేందుకు EPFO 100 డమ్మీ అకౌంట్లతో ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ యాప్‌ను తీసుకొచ్చేందుకు కార్మిక శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా ఈపీఎఫ్‌ డబ్బులు తీసుకోవాలంటే ఆన్‌లైన్‌ అప్లై చేసుకోవడం.. ఆ తర్వాత కొన్ని రోజులకు డబ్బులు పడటం చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ త్వరలోనే వేగంగా ఈపీఎఫ్‌ డబ్బులు పొందే సదుపాయం రానుండటంతో చందదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read: ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్

Advertisment
తాజా కథనాలు