Microsoft: మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగులకు బిగ్ షాక్.. సంస్థలో భారీగా లేఆఫ్‌లు

ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉన్న తమ సిబ్బందిలో మూడు శాతం ఉద్యోగస్థులపై వేటు వేయనున్నట్లు సమాచారం. 2023లో మైక్రోసాఫ్ట్ 10 వేల మందిపై వేటు విధించింది. మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించాలనే ఉద్దేశంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

New Update
Microsoft

Microsoft

ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగస్థులను తొలగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉన్న తమ సిబ్బందిలో మూడు శాతం ఉద్యోగస్థులపై వేటు వేయనున్నట్లు సమాచారం. 2023లో మైక్రోసాఫ్ట్ 10 వేల మందిపై వేటు విధించింది. ఇప్పుడు మళ్లీ వేల మందిపై వేటు విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించాలనే ఉద్దేశంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉండే ఈ ఏడాది ప్రారంభంలో కూడా మైక్రోసాఫ్ట్ ఉద్యోగస్థులను తొలగించిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చూడండి: AP liquor case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..మిథున్‌ రెడ్డికి నో బెయిల్‌

ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..

ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ

ఒకేసారి 20 వేల మంది..

ఇదిలా ఉండగా ఆటో సెక్టారుకు చెందిన నిస్సాన్ మోటార్ ఒకేసారి 20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. మొదట 9 వేల మంది ఉద్యోగాలను తొలగించాలని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు దానికి 11 వేల మందిని యాడ్ చేసింది. ఒకేసారి ఇన్ని వేల మంది ఉద్యోగస్థులను తొలగించడానికి ముఖ్య కారణం.. అమెరికా, చైనాల్లో అమ్మకాలు తగ్గడమే. కంపెనీ ఆదాయం 94 శాతం వరకు పడిపోయింది. ఈ క్రమంలోనే 15 శాతం మంది ఉద్యోగస్థులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు