మార్కెట్ లోకి ఆల్టో కొత్తవెర్షన్.. రూ. 5.5లక్షలకే 30కి.మీ మైలేజ్ కారు!

మారుతి సుజుకి త్వరలో మరో కొత్త వెర్షన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. తన ఆల్టో మోడల్ లో కొత్త వెర్షన్ ను డెవలప్ చేస్తుంది. దీని ధర సుమారు రూ.5.46 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది లీటరుకు దాదాపు 30 కి.మీ మైలేజీ అందిస్తుందని భావిస్తున్నారు.

New Update
Maruti Suzuki Alto

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ కార్లలో మారుతీ సుజుకి కంపెనీకి చెందిన ఆల్టో కూడా ఒకటి. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫేవరేట్ కారుగా బాగా ప్రజాదరణ పొందింది. తక్కువ ధర, ఎక్కువ మైలేజీ, అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండటంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ కారుపైనే ఆసక్తి చూపిస్తున్నారు. 

Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

ఆల్టోలో కొత్త వెర్షన్

అయితే ఇప్పుడు మారుతీ సుజుకి కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఆల్టోలో కొత్త వెర్షన్ ను మరింత తక్కువ ధరకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ తన 10వ తరం ఆల్టోను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. 

Also Read :  మెగా కోడలు లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటోస్ చూశారా?.. అదిరిపోయాయంతే

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కొత్త వెర్షన్ ఆల్టో కారులో అల్ట్రా హై టెన్సైల్ స్టీల్ తో తయారు చేసిన తేలికగా ఉండే హార్టెక్ట్ ప్లాట్ ఫారమ్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కొత్త వెర్షన్ ప్రస్తుతం ఉండే మోడల్ కంటే మరింత మెరుగైన మైలేజ్ ను అందిస్తుందని సమాచారం. 

Also Read: Crime: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!

ఈ ఆల్టో కొత్త వెర్షన్ లో 2 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటారుతో 49పిఎస్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చుతున్నాట్లు తెలుస్తోంది. అలాగే మోటార్ అవుట్ పుట్ మరింత పెంచడానికి లీన్ బ్యాటరీ సిస్టమ్ ను కూడా అటాచ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ సరికొత్త ఆల్టో కారు లీటరుకు దాదాపు 30 కి.మీ మైలేజీ అందిస్తుందని భావిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read :  మొత్తానికి అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరో బయటపెట్టిన రష్మిక..!

ప్రస్తుత ఆల్టో పెట్రోల్ వేరియంట్ ధర (10,68,000) యెన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.5.83 లక్షలు ధరను కలిగి ఉంది. అలాగే మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ ధర (12,18,800) యెన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.6.65 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అయితే త్వరలో విడుదల కానున్న సరికొత్త ఆల్టో ధర సుమారు రూ.5.46 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు