New year 2025: ఖమ్మంలో కుమ్మేశారు.. వంద కోట్లు దాటిన మద్యం అమ్మకాలు!

న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కరోజే రూ.120 కోట్లు మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌ ఏప్రిల్-డిసెంబర్ రూ.1300 కోట్లతో రికార్డు క్రియేట్ చేసినట్లు వెల్లడించారు.  

New Update
Liquor

Liquor Photograph: (Liquor)

New year 2025: న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 25 నుంచే భారీ ఎత్తున దావత్‌లు జరుగుతుండగా.. వారంరోజుల్లో వందల కోట్లలో తాగేసినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం భారీగా అమ్ముడైనట్లు తెలిపారు. 2024 చివరి మూడు రోజుల్లో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని, కేవలం మూడు రోజుల్లోనే  రూ. 55 కోట్ల రూపాయలకు పైగా మద్యం సేల్స్ అయినట్లు వెల్లడించారు. 

రూ.120 కోట్లు క్రాస్..

ఇక డిసెంబర్ 30 వతేదీన అత్యధికంగా రూ.25 కోట్లు, 31న రూ.17 కోట్ల అమ్మకాలు జరిగాయి. మొత్తంగా బహిరంగ మార్కెట్లతో కలిసి రూ.120 కోట్లు క్రాస్ దాటినట్లు అధికారులు చెప్పారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 210 వైన్స్, 50 బార్లు, 3 క్లబ్బులున్నప్పటికీ.. ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మద్యం ప్రియులు అసహనం వ్యక్తం చేశారు. చేసేదేమి లేక ఉన్న బ్రాండ్లతోనే సంతృప్తి పొందారు. 

ఇది కూడా చదవండి: TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్..అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్

మహబూబ్‌నగర్‌ రికార్డ్..

ఇదిలా ఉంటే.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 31 రోజు రూ.12.60కోట్ల  మద్యం తాగేసి రికార్డు క్రియేట్ చేశారు. డిసెంబర్‌ 31న 11,400లిక్కర్‌ కేసులు, 18,401 కేసుల బీర్‌ అమ్ముడైనట్లు డిపో మేనేజర్‌ సయ్యద్ చెప్పాడు. ఈ యేడాది 2024 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ 31వ వరకు రూ.1300 కోట్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. 

Advertisment
తాజా కథనాలు