/rtv/media/media_files/2025/08/26/layoffs-2025-08-26-11-05-23.jpg)
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, మార్కెట్లలో వస్తున్న మార్పుల వల్ల చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోతలను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా 2024 నుండి ఈ లేఆఫ్‌ల ట్రెండ్ మరింత వేగవంతమైంది. పాత టెక్నాలజీలపై ఆధారపడిన నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల స్థానంలో, AI, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త నైపుణ్యాలు ఉన్నవారిని నియమించుకోవడానికి కంపెనీలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రకటనల రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జపాన్ సంస్థ డెంటసు (Dentsu), వ్యయ నియంత్రణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 3 వేల 400 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read : AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీలో ఘరానా మోసం .. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిపోయారు!
Layoffs 2025: Japanese Advertising Firm Dentsu Group To Lay Off 3,400 Overseas Employees Amid Failing Business and Restructuring Efforts To Save Millions of Annual Operating Cost#Layoffs#Dentsu#DentsuLayoffs#DentsuGroup#Layoffs2025@dentsu_global
— LatestLY (@latestly) August 15, 2025
ఈ తొలగింపులు ప్రధానంగా జపాన్ వెలుపల ఉన్న అంతర్జాతీయ కార్యకలాపాల్లో జరుగుతాయి.హెడ్‌క్వార్టర్స్, బ్యాక్-ఆఫీస్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది మొత్తం అంతర్జాతీయ ఉద్యోగులలో 8 శాతం మందికి సమానం.ఉద్యోగుల తొలగింపు ద్వారా సంస్థ సుమారు 52 బిలియన్ యెన్ల ($355 మిలియన్లు) వార్షిక ఖర్చులను ఆదా చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 ఆర్థిక సంవత్సరంలో 16% నుంచి 17% ఆపరేటింగ్ మార్జిన్‌ను సాధించాలని డెంటసు ఆశిస్తోంది.
జపాన్‌లో బాగా రాణిస్తున్నప్పటికీ
డెంటసు కంపెనీ జపాన్‌లో బాగా రాణిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ సంస్థ గ్లోబల్ సీఈఓ హిరోషి ఇగరాషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ తొలగింపుల వల్ల భారత్ లోని ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కాగా 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో డెంటసు సంస్థకు భారీగా 62 బిలియన్ యెన్ల (సుమారు $424 మిలియన్లు) ఆపరేటింగ్ నష్టం వచ్చింది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా మార్కెట్లలో సంస్థ పనితీరు మందగించడం ఈ నష్టాలకు ప్రధాన కారణం.ఈ నష్టాలను భర్తీ చేయడానికి, అంతర్జాతీయ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి డెంటసు ఒక పునర్నిర్మాణ ప్రణాళికను చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగాల తొలగింపు ఒక ముఖ్యమైన చర్య అని చెప్పాలి.
Also Read:Rasha Thadani: అప్పుడు మిస్.. ఇప్పుడు జాక్ పాట్! ఘట్టమనేని హీరోతో రవీనా టాండన్ కూతురు