JioTag Go: జియో తాజాగా ఒక కొత్త GPS ట్రాకర్‌ను లాంచ్ చేసింది, ఇది తాళాలు, పర్సులు, లగేజీ వంటి వస్తువులను సులభంగా ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. గూగుల్ ఫైండ్ మై డివైస్ సపోర్ట్ తో, ఈ ట్రాకర్ అల్ట్రా-కాంపాక్ట్ డిజైన్‌లో అందించింది, అదనంగా, బడ్జెట్ ధరతో మార్కెట్లోకి వచ్చింది. Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు "జియో ట్యాగ్ గో" ఈ GPS ట్రాకర్ ముఖ్యంగా రోజువారీ జీవితంలో ఏ వస్తువులు ఎక్కడ పెట్టామో త్వరగా గుర్తుకు రాదు. వాటిని ట్రాక్ చేయడానికి ఈ డివైస్ చాలా ఉపయోగపడుతుంది. వాహన తాళాలు, ఇంటి తాళాలు లేదా ప్రయాణ సమయంలో లగేజీ వంటి వస్తువులను ట్యాగ్ చేసి ట్రాక్ చేయవచ్చు. Also Read: అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్! జియో ఈ ట్రాకర్ ను Google Find My Device యాప్‌తో ఇంటిగ్రేట్ చేసింది, ఏ వస్తువునైనా జత చేసిన తర్వాత ఎక్కడ ఉన్నా ఆ వస్తువును వెతకడం చాలా సులభం. ఈ ట్రాకర్ 1 సంవత్సరం బ్యాటరీ లైఫ్ తో వస్తుంది, బ్యాటరీకి గడువు ముగిసిన తర్వాత కొత్త బ్యాటరీని మార్చవచ్చు. Also Read: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు! ఈ GPS ట్రాకర్ SIM లేకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ట్రాక్ అవుతుంది. Lost Mode ని ఎనేబుల్ చేస్తే, Find My Device నెట్‌వర్క్‌లోకి వెళ్లిన వెంటనే ఆటోమేటిక్ నోటిఫికేషన్ అందుతుంది. ఈ జియో ట్రాకర్ "జియో ట్యాగ్ గో" రూ. 1,499 ధరకు అమెజాన్, జియో వెబ్సైట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ వద్ద అందుబాటులో ఉంది. Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!