TTD: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు!

తిరుమలలో సిట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనగపప్పు పిండి పట్టడం, నెయ్యి సేకరణ, నాణ్యత తనిఖీకి ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను పరిశీలించారు. పోటు ఏఈవో మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, పంపిణీ విధానం తెలుసుకున్నారు.

New Update
Tirumala Laddu -1

Tirumala: తిరుమలలో సిట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనగపప్పు పిండి పట్టడం, నెయ్యి సేకరణ, నాణ్యత తనిఖీకి ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను పరిశీలించారు. పోటు ఏఈవో మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, పంపిణీ విధానం తెలుసుకున్నారు. కాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరాచేసిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆందోళన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం విచరణకు సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు

సిట్ దర్యాప్తులు లో సంచలన విషయాలు...

Also Read: అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్!

సుప్రీం కోర్టు నియమించిన సిట్‌ అధికారులు సీబీఐ డైరెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. కల్తీ నెయ్యి కేసు విచారణలో తాము సేకరించిన సమాచారాన్ని సీబీఐ డైరెక్టర్ కు వివరించారు. అసలు ఈ నెయ్యి ఏఆర్ డెయిరీ తాయారు చేసింది కాదని సంచలన విషయాన్ని బయటపెట్టారు. వాస్తవానికి లడ్డూ తాయారు చేసేందుకు అవసరమైన నెయ్యిని సరఫరా చేస్తామని టీటీడీతో ఏఆర్ డెయిరీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని.. కానీ ఒప్పందాలను పక్కకు ఏఆర్ డెయిరీ నిర్వాహకులు వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తన ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సిట్ అధికారుల విచారణలో తేలింది.

ఖచ్చితమైన ఆధారాలతో...

కాగా ఈ ఏడాది మొదట్లో టీటీడీతో ఏఆర్ డెయిరీ ఒప్పందం చేసుకుంది. ఏఆర్ డెయిరీ సంస్థ తమిళనాడుకు చెందినది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా ఏఆర్ డెయిరీ వ్యవహరించింది. తమ లారీలను వైష్ణవి డెయిరీకి పంపి అక్కడి నుంచి నెయ్యిని తీసుకొని.. టీటీడీకి సరఫరా చేసినట్లు ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. లారీ వెళ్లే మార్గాలు, టోల్ గెట్ వద్ద ఆగిన సమయాలు ఇలా అన్ని ఆధారాలను సిట్ అధికారులు పక్కాగా సేకరించినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసు విచారణ ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ కేసును సిట్ అధికారులు ఛేదించి అసలు విషయాలను బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు