/rtv/media/media_files/2024/10/27/KeLW63Get5UlSfRzkxJr.jpg)
Union Minister Rammohan Naidu
Ram Mohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును పొందారు. 2014లో 26 ఏళ్ల అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుల్లో ఒకరిగా ఉన్న రామ్మోహన్ నాయుడు.. 2024 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన నాయకత్వంలో భారత దేశ పౌర విమానయానం బాగా అభివృద్ధి చెందుతోంది. పలు ప్రాంతాల్లో కొత్త ఎయిర్ పోర్టులను మంజూరు చేయడంతో పాటూ ఇప్పుడున్న వాటిని మరింత అభివృద్ధి చేయడం వరకు రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారు. మంత్రి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
Also Read: బాలయ్య బర్త్ డేకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్ కి పండగే..!
Also Read: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
ఇది నాకు గొప్ప గౌరవం...
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(World Economic Forum) యంగ్ లీడర్ గా ఎంపిక కావడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. భారతదేశం అభివృద్ధి చెందుతోందని... ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి యువత చేరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇండియాలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు. నిజాయితీ, కొత్త ఆలోచనలతో పని చేయాలనే స్వభావమే యువతను ముందుకు తీసుకువెళుతుందని రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు దేశానికి, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణమన్నారు. రామ్మోహన్ నాయుడి పనితనం, అంకితభావం యువతకు స్ఫూర్తినిస్తుందని సీఎం ఆశిస్తున్నారు.
today-latest-news-in-telugu | rammohan-naidu | central-minister | world-economic-forum | young-leader | award
Also Read: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!