/rtv/media/media_files/2025/03/03/NVVJCwmyl8bPrZ8tWsWg.jpg)
iPhone 15 available on Flipkart
జీవితంలో ఒక్కసారి అయినా IPHONE వాడాలని అందరికీ ఉంటుంది. అందులో ఉండే మహాత్యం ఏమిటో తెలియకపోయినా.. ఐఫోన్ అంటే అదో పిచ్చి. దాంతో ఐఫోన్ కోసం కొందరు ఎగబడుతుంటారు. రేటు ఎంతున్నా కొనేందుకు అస్సలు వెనక్కి తగ్గరు. లక్షలు పెట్టి రకరకాల మోడల్ కొనేస్తుంటారు. మరికొందరు మాత్రం ఐఫోన్ వాడాలన్న కోరిక, ఆసక్తి ఉన్నా డబ్బుల్లేక వెనక్కి తగ్గుతారు.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
రూ.24వేల లోపే ఐఫోన్
ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో ఆఫర్లు వస్తే అప్పుడు కొనుక్కోవచ్చులే అని అనుకుంటుంటారు. మరి మీరు కూడా అలాంటి ఐఫోన్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 పై ఊహకందని డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ డిస్కౌంట్‌తో IPHONE 15 ఫోన్‌ను కేవలం రూ.24వేల లోపే సొంతం చేసుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
ఐఫోన్ 15 మొత్తం మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. అందులో బేస్ వేరియంట్ 128జీబీ వేరియంట్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధరను కంపెనీ రూ.69,999గా నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ.4,901 తగ్గింపుతో రూ.64,999 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. దీనిపై పలు ఆఫర్లు కూడా పొందొచ్చు.
బ్యాంక్ డిస్కౌంట్
ఈ ఫోన్ కొనుగోలు చేసే సమయంలో ఫోన్ పే యూపీఐ ద్వారా ట్రాన్సక్షన్స్ చేస్తే దాదాపు రూ.2000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ తగ్గింపుతో ఐఫోన్‌ను రూ.62,999కి కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై క్యాష్‌బ్యాక్ సైతం లభిస్తుంది. ఇది కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది.
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!
దాదాపు రూ.39,150 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇది పూర్తిగా వర్తిస్తే ఐఫోన్ 15ను కేవలం రూ.23,849లకే సొంతం అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంత భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తించాలంటే.. పాత ఫోన్ మోడల్ బట్టి ఉంటుంది. అలాగే ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత మొత్తంలో ఆఫర్ పొందొచ్చు.