Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

భారత స్టాక్ మార్కెట్ 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్‌లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.

New Update
Stock Market,

Stock Market: భారత స్టాక్ మార్కెట్లు 2024 సంవత్సరం చివరి రోజైన నేడు (డిసెంబర్ 31న) ట్రేడింగ్ సెషన్‌లో భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం మొత్తం నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 508 పాయింట్లు బలహీన పడిందని సమాచారం.

Also Read: Maharashtra: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలుపు: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.మరోవైపు బ్యాంక్ నిఫ్టీలో 155 పాయింట్ల క్షీణత కనిపించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 474 పాయింట్లు మేర నష్టాలను చవిచూసింది. ప్రధానంగా ఐటీ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రైవేట్ బ్యాంక్ రంగం కూడా బలహీనంగా ఉంది. అయితే లోహాలు స్వల్ప పెరుగుదలతో తెరవబడ్డాయి. మార్కెట్‌కు ప్రభుత్వ షేర్ల నుంచి మద్దతు లభించింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది.

Also Read: TAX: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్

ఈ నేపథ్యంలో ప్రస్తుతం టెక్ మహీంద్రా, విప్రో, అదానీ ఎంటర్‌ప్రైస్‌ ,ఇన్ఫోసిస్, TCS, కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా కోల్ ఇండియా, SBI, JSW ONGC, భారత్ ఎలెక్ట్రిక్, స్టీల్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో నడుస్తున్నాయి. గత త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల బలహీనమైన త్రైమాసిక రిజల్ట్స్‌ , నిరంతర విదేశీ అమ్మకాలు మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపించాయి. మొత్తం 13 ప్రధాన రంగాలు క్షీణతను నమోదు చేశాయి. IT 0.8% క్షీణతతో టాప్ సెక్టార్‌గా ఉంది. దేశీయంగా ఫోకస్ చేసిన స్మాల్‌క్యాప్‌లు, మిడ్‌క్యాప్‌లు వరుసగా 0.25%, 0.5% మేర క్షీణించాయి.

Also Read: South Korea: ఫ్లైట్ అంటే భయపడుతున్నారు..68వేల బుక్సింగ్స్ క్యాన్సిల్

పతనమవ్వడానికి కారణం ఏంటంటే!

ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలతో సహా ఆసియా మార్కెట్ల పతనం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపనుంది. US లో బాండ్ ఈల్డ్స్ పెరగడం అభివృద్ధి చెందుతున్న స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో మార్కెట్లలో క్షీణత కనిపిస్తోంది. ఈ కారణంగా విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ల నుంచి డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు.

Also Read: Taliban: అఫ్గాన్ మహిళలకు మరో షాక్.. తాలిబన్ల కొత్త రూల్

 విదేశీ పెట్టుబడిదారులు సోమవారం రూ. 240.45 బిలియన్ల విలువైన షేర్లను విక్రయించారు. వరుసగా 10వ ట్రేడింగ్ సెషన్‌లో కూడా నికర అమ్మకదారులు పెరిగినట్లు సమాచారం. దీనికి విరుద్ధంగా, దేశీయ పెట్టుబడిదారులు వరుసగా 9వ ట్రేడింగ్ సెషన్‌లో నికర కొనుగోలుదారులుగా ఆగిపోయారు


సోమవారం మార్కెట్ ..

సోమవారం కూడా భారత బెంచ్‌మార్క్ సూచీలు పడిపోయాయి. ఆ క్రమంలో 30 షేర్ల BSE సెన్సెక్స్ సోమవారంనాడు  450.94 పాయింట్ల పతనంతో 78,248.13 వద్ద ఆగిన విషయం తెలిసిందే. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా 168.50 పాయింట్లు క్షీణతతో 23,644.90 వద్ద ఆగింది. ఈ ఏడాది ఇప్పటివరకు నిఫ్టీ, సెన్సెక్స్‌లు వరుసగా 8.8%, 8.3% పెరిగాయి. ఇది 2023లో దాదాపు 20% జంప్ కంటే చాలా తక్కువ ఉన్నాయి.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు