South Korea: ఫ్లైట్ అంటే భయపడుతున్నారు..68వేల బుక్సింగ్స్ క్యాన్సిల్

దక్షిణ కొరియా ముయాన్ విమానాశ్రయంలో దుర్ఘటన రిగిన తర్వాత అక్కడి జనాలు ప్రయాణాలు అంటేనే భయపడిపోతున్నారు. దాంతో మొత్తం బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. ఇప్పటివరకు 68వేల రిజర్వేషన్లు రద్దు అయ్యాయి. 

New Update
accident

Jeju Flight

గత పదిహేను రోజుల్లో మూడు విమానాలు యాక్సిడెంట్‌కు గురయ్యాయి. అందులో దక్షిణ కొరియా ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రంలో జరిగింది అయితే పెను విషాదాన్నే మిగిల్చింది. ఈఘటనలతో విమాన ప్రయాణాలు అంటేనే భయమేసే పరిస్థితికి వచ్చింది.  దక్షిణ కొరియా ప్రజలు అయితే మరీ భయపడిపోతున్నారు. నిన్నటి నుంచి అక్కడ రద్దవుతున్న బుకింగ్సే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు దాదాపు 68వేల విమాన రిజర్వేషన్‌ బుకింగ్స్‌ రద్దయ్యాయని జెజు ఎయిర్ సస్థ తెలిపింది.  వీటిలో 33వేలకు పైగా డొమెస్టిక్ కు సంబంధించిన బుకింగ్స్‌ అయితే మరో 34వేలకు పైగా అంతర్జాతీయం బుకింగ్ రద్దు చేసకున్నారు, ముఖ్యంగా టూర్‌ ప్యాకేజీల క్యాన్సిలేషన్స్‌ బాగా పెరిగిపోయాయి. ఆదివారం ఒక్కరోజే తమకు 40కి పైగా క్యాన్సిలేషన్‌కు సంబంధించిన ఎంక్వైరీలు వచ్చినట్లు అక్కడ ఉన్న  ఓ ట్రావెలింగ్ కంపెనీ చెబుతోంది.

ఇక దక్షిణ కొరియాలో జెజు విమానం కూలడానికి ముందు పక్షి ఢీకొనడమే కారణమని చెబుతున్నారు. ఈ మేరకు దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ అధికారి వివరాలు తెలిపారు. విమానం కూలడానికి కొద్దిసేపటికి ముందు పైలెట్ మేడే కాల్ ప్రకటించారని తెలిపారు. మరోవైపు ముయాన్‌ ఎయిర్‌పోర్టులో జరిగిన విమాన ప్రమాదం అంత పెద్దగా అవడానికి రన్‌వే చివర కాంక్రీట్‌ గోడే అంటున్నారు నిపుణులు. అది లేకపోతే.. కనీసం మరికొంత మంది ప్రాణాలైనా దక్కేవని చెబుతున్నారు. ప్రమాద తీవ్రత కూడా ఈ స్థాయిలో ఉండేది కాదని అంటున్నారు. రన్‌ వే చివరలో గోడ నిర్మించడమేమిని అంటున్నారు.

జెజు ఎయిర్‌ విమానం థాయ్‌లాండ్‌ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియా లోని ముయాన్‌కు బయలుదేరింది. రయాణం మొత్తం అయిపోయింది...ఇక అయిదు నిమిషాల్లో ఫ్లైట్ ల్యాండ్‌ అవుతుంది అనుకున్న సమయానికి విమానం రన్‌వేపై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకెళ్ళి.. గోడను ఢీకొట్టి, పేలిపోయింది. అయితే ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో  విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దానివలనే ఫ్లైట్ ప్రమాదానికి గురి అయింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు