/rtv/media/media_files/3BXMV2CedYmao1iUk39N.jpg)
ప్రపంచ మార్కెట్లలో క్షీణత భారతీయ మార్కెట్ మీద కూడా పడింది. దీని కారణంగా ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం అయ్యాయి. అయితే దాని నుంచి తొందరగానే కోలుకుని నెమ్మదిగా లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 81,700 వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ రోజు కనిష్ట స్థాయి నుండి 250 పాయింట్లు కోలుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 25,000 స్థాయిలో ఉంది. మరోవైపు రూపాయి విలువ కూడా భారీగా పతనం అయింది. నిన్నటి రూ.86.95తో పోలిస్తే 21 పైసలు తగ్గి రూ.87.16 దగ్గర ట్రేడ్ అవుతోంది.
సెన్సెక్స్ 30 స్టాక్స్ లలో 23 నష్టాల బాటలో ఉండగా.. 7 మాత్రం పెరుగుదలను చూపెడుతున్నాయి. ఎయిర్‌టెల్, ఎన్‌టిపిసి మరియు జొమాటో షేర్లు 1% పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 1.5% తగ్గాయి. నజరా టెక్నాలజీస్, డెల్టాకార్ప్, సీఎస్‌బీ బ్యాంక్, పవర్ మెక్ ప్రాజెక్ట్స్ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు
నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 26 నష్టపోయాయి. 24 లాభాల్లో ఉన్నాయి. NSE మీడియా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 1% వరకు పడిపోయాయి. FMCG, IT, రియాలిటీ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. లాస్ట్ ఫోర్ డేస్ సూచీలు విపరీతంగా లాభాల్లో పయనించాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపారు.
A lot of green on the Profit Watchlist today.
— NDTV Profit (@NDTVProfitIndia) August 20, 2025
For the latest #stockmarket updates, visit: https://t.co/hGuNf0SOu5pic.twitter.com/KvXh5cCx58
#Nifty, #Sensex open slightly lower as #RIL, #HDFCBank shares weigh
— NDTV Profit (@NDTVProfitIndia) August 20, 2025
For the latest #stockmarket updates, visit: https://t.co/1zKtASVGoapic.twitter.com/uacjL5JdML
అంతర్జాతీయ మార్కెట్లలో..
ప్రపంచ మార్కెట్ క్షీణించింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 1.52% తగ్గి 42,883 వద్ద, కొరియా కోస్పి 1.86% తగ్గి 3,092 వద్ద ముగిశాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.42% తగ్గి 25,016 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.056% తగ్గి 3,725 వద్ద ముగిశాయి. మరోవైపు ఆగస్టు 19న అమెరికా డౌ జోన్స్ 0.023% పెరిగి 44,922 వద్ద ముగిసింది. అదే సమయంలో, నాస్‌డాక్ కాంపోజిట్ 1.46% పెరిగి 21,315 దగ్గరా, ఎస్ అండ్ పి 500 0.59% తగ్గి 6,411 వద్ద ముగిశాయి. ఆగస్టు 19న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో రూ.634.26 కోట్ల నికర కొనుగోళ్లు చేయగా, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.2,261.06 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.