Stock Market: మళ్ళీ మొదలు..ట్రంప్ ఎఫెక్ట్ తో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

 దేశీ స్టాక్ మార్కెట్ల మీద మళ్ళీ ట్రంప్ దెబ్బ పడింది. భారత్ మీద సుంకాలు పెంచుతామని నిన్న చేసిన ప్రకటనతో దేశీ మార్కెట్లు నష్టాల్లో ఈదుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 80,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు తగ్గి 24,600 వద్ద ఉంది.

New Update
usa

Trump, US Stock Markets

దేశీ మార్కెట్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మామ ఆటలాడుతుకుంటున్నాడు. రోజుకో అనౌన్స్ మెంట్ చేస్తూ దడ పుట్టిస్తున్నాడు. భారత్ మీద ఇప్పటికే 25శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీని తర్వాత ఒడిదుడుకులు ెదుర్కొన్న స్టాక్ మార్కెట్లు కొన్ని రోజుల తర్వాత తేరుకుంది. లాభనష్టాలను బేరీజు వేసుకుని దాని ప్రకారం మామూలు స్థితికి చేరుకుంది. దీంతో గత కొంతకాలంగా వరుసగా లాభాల్లో పయనించింది. అయితే నిన్న రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే మరింత ఎక్కువ టారీఫ్ లు తప్పవంటూ ట్రంప్ మళ్ళీ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈరోజు స్టాక్ మార్కెట్లు కుదులయ్యాయి. 

వారంలో రెండవ రోజు అంటే మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 80,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు తగ్గి 24,600 వద్ద ఉంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 8 లాభపడ్డాయి, 22 నష్టపోయాయి. ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, బిఇఎల్ స్టాక్‌లు దాదాపు 1.5% పడిపోయాయి. ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్ స్వల్పంగా లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 16 లాభపడగా.. 34 నష్టపోయాయి. NSEలోని అన్ని రంగాలు నష్టపోయాయి. చమురు, గ్యాస్, రియాల్టీ, ఐటీ, FMCG, ఫార్మా సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.85 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లు..

ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే..ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 0.63% తగ్గి 40,544 వద్ద, కొరియా కోస్పి 1.07% పెరిగి 3,181 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.12% పెరిగి 24,763 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.53% పెరిగి 3,602 వద్ద ముగిసింది. అలాగే ఆగస్టు 4న అమెరికా డౌ జోన్స్ 1.34% పెరిగి 44,174 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 1.95% పెరిగి 21,054 వద్ద ముగిసింది. ఎస్&పి 500 1.47% పెరిగి 6,330 వద్ద క్లోజ్ అయింది. ఆగస్టు 4న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో రూ.2,566.51 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.4,386.29 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.

Also Read: Amit Shah: మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం

Advertisment
తాజా కథనాలు