/rtv/media/media_files/2025/01/31/s4rn9eoxSt6bKfEMQnGd.jpg)
Stocks
భారత ప్రధాని మోదీ తనకు మంచి ఫ్రెండ్ అని..ఆయనతో రెండు , మూడు వారాల్లో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనౌన్స్ చేశారు. దానికి ప్రతిగా మోదీ కూడా..తాను కూడా ట్రంప్ తో మాట్లాడేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. నెల రోజులుగా భారత్, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఒకరితో ఒకరు మాట్లాడకుండా అధినేత గాంభీర్యం ప్రదర్శించారు. ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలను అమలు చేశారు. దీనిపై మన దేశం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మొత్తానికి అమెరికా అధ్యక్షుడు కాస్త దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. భారత్ ప్రధానితో మాట్లాతానని..సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పారు.
దీంతో రెండు దేశాల్లో జోష్ వచ్చింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ప్రారంభం నుంచే రాకెట్స్ లా దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 81,500 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 120 పాయింట్లు పెరిగి 25,000 స్థాయిలో ఉంది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 22 లాభపడ్డాయి మరియు 8 నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో దాదాపు 1728 కంపెనీల షేర్లు గ్రీన్ జోన్ లో ఉండగా..595 మాత్రం రెడ్ జోన్ లో ఉన్నాయి. అలాగే 168 షేర్లు ఫ్లాట్ ఓపెనింగ్‌ను కలిగి ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, జియో ఫైనాన్షియల్, LT, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మరియు TCS షేర్లు పెరుగుతున్నాయి.
రాకెట్ లా పది షేర్లు..
క్రితం రోజుతో చూసుకుంటే ఈరోజు చాలానే స్టాక్స్ పెరుగుదల చూపిస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా HCL టెక్ (2.28%), టెక్ మహీంద్రా (2.10%) లతో పాటూ లార్జ్‌క్యాప్ కేటగిరీలో చేర్చబడిన TCS (1.95%) లాభంతో పెరిగాయి. మిడ్‌క్యాప్ కేటగిరీలో.. భారత్ ఫోర్జ్ (4.13%), ఎంఫసిస్ (3.79%), థర్మాక్స్ (3.71%), టాటా ఎల్క్సి (3.30%), కోఫోర్జ్ షేర్ (3.20%) లాభంతో ట్రేడవుతున్నాయి. ఇది కాకుండా, స్మాల్ క్యాప్ కేటగిరీలో, సస్తా సుందర్ షేర్ 20%, వెల్స్పన్ షేర్ 10.50% మరియు ICIL షేర్ 8.20% పెరిగాయి. అలాగే NSE లో ఐటీ ఇండెక్స్ 2.01% పెరిగింది. దీనితో పాటు, బ్యాంకింగ్, ఫార్మా, రియాలిటీ ఇండెక్స్ కూడా 1% వరకు పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్..
ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.66% పెరిగి 43,748 వద్ద, కొరియా కోస్పి 1.57% పెరిగి 3,311 వద్ద ట్రేడవుతున్నాయి.
హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.19% పెరిగి 26,246 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.17% పెరిగి 3,813 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 9న, US డౌ జోన్స్ 0.43% పెరిగి 45,711 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.37% మరియు S&P 500 0.27% పెరిగాయి.
Also Read: US-China: తాను తీసిన గోతిలో తానే..అమెరికా కంపెనీలను దెబ్బేసిన ట్రంప్ సుంకాలు