BIG BREAKING: మందుబాబులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బీర్ల ధరలు!

మందుబాబులకు కిక్కు ఇచ్చే గుడ్ న్యూస్. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో బీర్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఒక్కో బ్రాండ్ రూ.20 నుంచి రూ.35 వరకు తగ్గనుంది. ఇది కొన్ని బ్రాండ్లకే పరిమితం కానున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. 

New Update
wines closed

Beer prices down

BIG BREAKING: మందుబాబులకు కిక్కు ఇచ్చే గుడ్ న్యూస్ వెలువడింది. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో బీర్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఒక్కో బ్రాండ్ రూ.20 నుంచి రూ.35 వరకు తగ్గనుంది. అయితే ఈ తగ్గింపు కొన్ని బ్రాండ్లకే పరిమితం కానున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. 

75 శాతం తగ్గిన పన్ను..

ఈ వేసవిలో  బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కేఎఫ్, తదితర బీర్ల కొరత ఏర్పడుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం కూడా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ కేఎఫ్ బీర్ ధర 30కి పైగా పెరగడంతో మందుబాబులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో బ్రిటన్ బీర్‌పై పన్ను ఏకంగా 75 శాతం తగ్గింది. దీంతో ఒక్కో యూకే బీర్ పై దాదాపు 35 రూపాయలు తగ్గనున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: చియా సీడ్స్‌ రోజూ తింటున్నారా..? నెల రోజుల్లో మీ శరీరంలో జరిగేది ఇదే..!

ప్రస్తుతం రూ.200 ఉన్న బ్రిటన్ బీర్ ఇకపై రూ.165 లేదా రూ.175 కే లభించనుంది. ఇక 2024 లో భారతీయ బీర్ మార్కెట్ విలువ రూ.50వేల కోట్లు ఉండగా.. ప్రతి సంవత్సరం సగటున 8-10శాతం వృద్ధి రేటును కలిగివున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: సరదాగా తీసుకునే స్నాక్స్‌తో ఆనారోగ్యం.. అధిక రక్తపోటుకు కారణాలు ఇవే


ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకు ఎక్సైజ్ శాఖ కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. తక్కువ ధరలకే మద్యం అందు బాటు లోకి తెచ్చేలా రంగం సిద్దమైంది. ఎక్సైజ్ శాఖ కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం  అందుబాటులోకి తీసుకురానుంది. ఫ్రూట్‌ జ్యూస్‌ తరహాలో మద్యం ప్యాకెట్లను జేబులో పెట్టుకుని తీసుకెళ్లేలా 60 ఎంఎల్‌, 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ల ప్యాకెట్లను తయారు చేసి అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు. సీసలతో పోలిస్తే ప్యాకెట్ల తయారీకి ధర తక్కువ ఉండడంతో ప్యాకెట్ల తయారీకే ఎక్సైజ్‌శాఖ మొగ్గు చూపుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు