నటి శ్రియా రెడ్డి తెలుగులో విడుదలైన తమిళ్ ఫిల్మ్ 'పొగరు' సినిమాలో ఈశ్వరి క్యారెక్టర్ తో టాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఆ తర్వాత కొన్నేళ్లు పాటు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ .. గతేడాది 'సలార్' సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుత శ్రియా పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా చేస్తోంది. ఇది కూడా చూడండి: సుమ కనకాల కొడుకుతో సందీప్ రెడ్డి వంగా.. షూటింగ్ మొదలు! Also Read : గూగుల్‌లో పనిచేసేవారికి షాక్.. 10 శాతం ఉద్యోగులు ఔట్ అద్భుతమైన వ్యక్తి.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ప్రశంసలు కురిపించింది. శ్రియా రెడ్డి మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చేశాను.. ఆయన చాలా తెలివైన, మర్యాద గల వ్యక్తి. ఎంతో హుందాగా నడుచుకుంటారు. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఎదుటివారితో ఆయన ప్రవర్తన, మాట్లాడే విధానం చక్కగా ఉంటుంది" అని చెప్పారు. 'సాహో' ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 'ఓజీ' షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు పవన్. 2023 లో మొదలైన 'ఓజీ' చిత్రీకరణ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆలస్యం అవుతూ వస్తుంది. ఇది కూడా చూడండి: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..! Also Read : ఆఫర్ అదిరిందిగా..! ఐఫోన్ ఇంత తక్కువ ధరలోనా..?