Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

New Update
Google Launches Emergency Location Service Feature for Android Smartphones in India

Google Launches Emergency Location Service Feature for Android Smartphones in India

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది. అత్యవసర సమయాల్లో ఈ విభాగాలకు కాల్ లేదా టెక్స్ట్‌ చేసినప్పుడు ఈ ఫీచర్‌ ద్వారా మీ లొకేషన్ కనిపిస్తుంది. ఈ సేవలు లభించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అత్యవసర సేవలతో ఎమర్జెన్సీ లోకేషన్‌ సర్వీసెస్‌ (ELS)ను లింక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని పోలీసు విభాగం ఈ సేవలను స్వీకరించింది. 

Also Read: యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉండాలి.. సీడీఎస్ అనిల్‌ చౌహాన్‌ కీలక వ్యాఖ్యలు

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి ఎవరైనా ఈ ఎమర్జెన్సీ సేవల విభాగానికి ఫోన్ చేస్తే ఆటోమోటిగ్‌గా కచ్చితమైన లోకేషన్ వివరాలు వాళ్లకి వెళ్తాయి. ఒకవేళ వివిధ కారాణాల వల్ల కాల్‌ కట్ అయినా కూడా లొకేషన్ వివరాలు వస్తాయి. జీపీఎస్, వైఫై, సెల్యులర్ నెట్‌వర్క్‌ ఆధారంగా ELS పనిచేస్తుంది. 112 గానీ ఇతర ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్‌ చేసినప్పుటు ఆటోమెటిక్‌గా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇందుకోసం అదనంగా యాప్స్‌గానీ, హార్డ్‌వేర్ గానీ అవసరం లేదని గూగుల్‌ చెప్పింది.   

Also Read: 54ఏళ్ల ఇండియా-బంగ్లాదేశ్ ప్రయాణం.. దోస్తానా? దుష్మనా?

ఉత్తరప్రదేశ్‌ లాగే ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని సూచనలు చేసింది. ఆండ్రాయిడ్ 6, ఆపై వెర్షన్ డివైజ్‌లకు ఈ ఫీచర్‌ పనిచేస్తుందని చెప్పింది. ఈ డేటా అంతా కూడా గూగుల్‌ కలెక్ట్‌ చేయబోతుందని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది.  

Advertisment
తాజా కథనాలు