/rtv/media/media_files/2026/02/01/union-budget-2026-2026-02-01-15-30-28.jpg)
union budget 2026
2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జె్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను లోక్‌సభకు సమర్పించారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. సైనిక ఆధునీకరణకు పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. రాఫెల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాలు వంటి కీలక ప్రాజెక్టులను ప్రతిపాదించింది.
ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌ను 8 శాతానికి పెంచారు. మొత్తం రూ.7.85 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ దళాల ఆధునీకరణ కోసం రూ.21 లక్షల కోట్లు కేటాయించనున్నారు. పౌర,శిక్షణ, ఇతర విమానాల తయారీకి కావాల్సిన విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే నిర్వహణ, మరమ్మత్తు లేదా ఇతర అవసరాల కోసం రక్షణ రంగ యూనిట్లు ఉపయోగించే వాటిపై మినహాయింపు ఇవ్వనున్నారు. ముఖ్యంగా విమాన భాగాల తయారీకి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలపై సైతం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించనున్నారు.
Also Read: ఆరోగ్య రంగానికి రూ.10,000 కోట్లు.. బయోఫార్మా హబ్‌గా భారత్!
భారత రక్షణ సామర్థ్యాలను, సాంకేతికతను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని కేంద్రం తెలిపింది. దేశ భద్రత అవసరాలు తీర్చేందుకు, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల సైన్యాన్ని సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకోనుంది. రక్షణ మంత్రిత్వ శాఖ (పౌర) బడ్జెట్‌కు స్వల్పంగా రూ.28,554.61 కోట్లు తగ్గింది. మరోవైపు రక్షణ సేవల (రెవెన్యూ) బడ్జెట్ రూ.3,65,478.98 కోట్లకు పెరిగింది. రక్షణ మూలధన వ్యయం 21.84 శాతం పెరిగి రూ.2,19,306.47 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రక్షణ పెన్షన్ల కేటాయింపు 6.53 శాతం పెరిగి రూ.1,71,338.22 కోట్లకు చేరింది.
ఇక 2025-26 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం 6.81 లక్షల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లకు పైగా పెంచారు. గతేడాది పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ సైన్యానికి మరింత ప్రోత్సాహకం అందించాలా బడ్జెట్‌ను పెంచారు. బడ్జెట్ పెంపుతో భారత్..చైనాకు కూడా గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: బలూచిస్తాన్‌లో రక్తపాతం: పాక్ ఆర్మీపై విరుచుకుపడ్డ BLA.. 47 మంది మృతి!
Follow Us