Gold Rates Today : పసిడి ధరల జోరుకు బ్రేక్ .. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అటు బంగారం, ఇటు వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి.

New Update
gold

గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధర(gold-rates-today) లకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అటు బంగారం, ఇటు వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కేవలం ఒక్క రోజులోనే ఈ లోహాల ధరలు కుప్పకూలడం బులియన్ మార్కెట్‌లో సంచలనంగా మారింది.

స్టాక్ మార్కెట్‌లో చోటుచేసుకున్న తీవ్రమైన ఒడిదుడుకులు, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు ఆల్‌టైమ్ హైలో ఉన్న రేట్లు.. నేడు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి.

హైదరాబాద్‌లో తాజా ధరలు(gold-rates-today-in-hyderabad) (జనవరి 31, 2026) పరిశీలిస్తే..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,867 (దాదాపు 20 వేల వరకు తగ్గింది). కిలో వెండి: రూ. 2,85,156 (రెండు రోజుల్లోనే లక్ష రూపాయల వరకు తగ్గింది). గత 11 ఏళ్ల చరిత్రలో ఒక్కరోజులో ఇంతలా రేట్లు పడిపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Also Read :  IT సోదాలు జరుగుతుండగానే రియల్టర్ ఆత్మహత్య

మరింత తగ్గే అవకాశం 

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని సమాచారం. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు ఇలా ఒక్కసారిగా దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

Also Read :  కలిసివచ్చిన ఈయూ డీల్.. లాభాల్లో షేర్ మార్కెట్

Advertisment
తాజా కథనాలు